పుల్వామా దాడి తర్వాత భారత్ - పాక్ ల మద్య ఎన్నో వివాదాలు చెలరేగాయి.  సరిహద్దులో ప్రస్తుతం ఇరు దేశాల మద్య కాల్పలు జరుగుతూనే ఉన్నాయి.  ఓ వైపు పాకిస్థాన్ కూర్చొని మాట్లాడుకుందాం అని అంటూనే మరోవైపు సరిహద్దులో గుళ్ల వర్షం కురిపిస్తున్నారు.  నిన్న పాక్ భూభాగంలో అడుగు పెట్టిన భారత ఎయిర్ ఫోర్స్ పైలట్ అభినందన్ ను  అదుపులో ఉంచుకోవడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.  తాజాగా  పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముహమ్మద్ ఫైసల్ మాట్లాడుతూ.. అభినందన్ క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.
Image result for pakistan muhammad faisalImage result for air pilots abhinandan
అభినందన్ ను యుద్ధ ఖైదీగా పరిగణించాలా? లేదా? అనే విషయంలో రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మరోవైపు పాక్ సైనికులు భారత సైనికుడైన అభినందన్ ని చిత్ర హింసలకు గురి చేస్తుందని.. జెనీవా ఒప్పందానికి తూట్లు పొడుస్తోందని భారత రక్షణ అధికారులు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ ఈ మేరకు స్పందించింది. అయితే భారత్ తమతో కొన్ని ఒప్పందాలు పెట్టుకుంటే పైలెట్ ని విడుదల చేస్తామని పాక్ సూచించినట్లు సమాచారం.

అయితే భారత పైలట్ అభినందన్ అప్పగింతపై పాకిస్థాన్ తో ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోలేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.   పాక్ బేషరతుగా తక్షణమే అభినందన్ ని విడుదల చేయాలని కోరాయి.  ఇమ్రాన్ ఖాన్ చర్చల ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. పాక్ ముందుగా ఉగ్రవాదులపై సత్వర చర్యలు తీసుకోవాలని, జై షే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలనే భారత్ లక్ష్యంగా చేసుకుందని, పాక్ మాత్రం భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుందని విమర్శించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: