జూనియర్ ఎన్టీఆర్.. నందమూరి తారక రామారావు అంశను అందుకున్నవారిలో ముందువరుసలో ఉంటారు. ఎన్టీఆర్ కు 12 మంది సంతానం ఉన్నా.. ఆయన పేరు నిలబెట్టే స్థాయిలో ఎవరూ లేకపోయారు. ఉన్నవాళ్లలో బాలకృష్ణ ఒక్కడే కాస్త ఆయన నటవారసత్వాన్ని కొంతవరకూ నిలబెట్టగలిగారు.

Image result for junior ntr and kodali nani


బాలయ్య తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఆ వారసత్వం కొనసాగిస్తున్నారు. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ క్రమంగా తాత పెట్టిన పార్టీకి దూరమవుతున్నారా అన్న అనుమానం కలిగే పరిస్థితులు వస్తున్నాయి. తన కొడుకు లోకేశ్ భవిష్యత్ కోసం మామ చంద్రబాబు కావాలనే జూనియర్ ఎన్టీఆర్‌ ను దూరంపెట్టారన్న సంగతి అందిరికీ తెలిసిందే.

Image result for junior ntr and narne srinivasarao


జూనియర్ కూడా అనువుగానిచోట అధికులమనరాదు.. అన్నట్టు కొద్దికాలంగా వివాదాల జోలికి, రాజకీయాల జోలికి వెళ్లకుండా సినిమాలు చేసుకుంటున్నారు. కానీ ఎప్పుడూ పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి పనీ చేయలేదు. కానీ ఆయన చుట్టు ఉన్న వారు ఒక్కొక్కరే వైసీపీలోకి వెళ్తుండటం వల్ల ఆయన పార్టీకి దూరమవుతున్నారా అన్న భావన కలుగుతోంది.

Image result for junior ntr and narne srinivasarao


ఎన్టీఆర్ కు చాలా సన్నిహితుడైన కొడాలి నాని చాలా రోజుల క్రితమే వైసీపీలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు. అన్నగా చెప్పుకునే నాని.. స్వయంగా మామ వైసీపీలోకి వెళ్లడంతో ఆ ప్రభావం జూనియర్ పై పడుతోంది. మరి జూనియర్ దీనిపై ఏమంటారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: