అభినందన్ .. ఇప్పుడు భారత దేశమంతా కలవరిస్తున్న పేరు. వీరోచితంగా శత్రుదేశ యుద్ధవిమానాన్ని కూల్చాడు. ప్రమాదవశాత్తూ తను ప్రయాణిస్తున్న విమానం కూలిపోయినా పారాచూట్ తో ప్రాణాలు దక్కించుకున్నాడు. శత్రుదేశంలో దిగినా.. దైర్యం చెక్కుచెదరక నిలిచాడు.

Related image


దేశ రహస్యాలను శత్రుదేశం కంటపడకుండా నమిలి మింగేశాడు.. శత్రువుల చేతికి చిక్కినా ఎక్కడా మనోనిబ్బరం చెదరలేదు. అయితే అభినందన్ ఒక్కడే కాదు. ఆయన ఫ్యామిలీ అంతా వీరోచిత కుటుంబ నేపథ్యమే. వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ కుటుంబం తరతరాలుగా వాయుసేనలో పనిచేస్తూ వస్తోంది.

Related image


అభినందన్‌ తండ్రి సింహకుట్టి ఎయిర్‌ మార్షల్‌గా సేవలందించారు. ఇప్పుడు రిటైర్ అయ్యారు. అభినందన్ తాత కూడా గతంలో వైమానిక దళంలో పనిచేశారు. ఆయన రెండో ప్రపంచ యుద్ధంలో కూడా పాల్గొన్నారట. అభినందన్ భార్య తన్వీ కూడా ఏమీ తక్కువ తినలేదు.

Image result for abhinandan family


ఆమె కూడా గతంలో వాయుసేనలో స్క్వాడ్రన్‌ లీడర్‌గా ఆమె పని చేశారు. అనేక కీలకమైన ఆపరేషన్లలో తన్వీ చురుగ్గా పాల్గొన్నారు. ప్రస్తుతం పదవీ విరమణ తీసుకున్న ఆమె తన సేవాకాలంలో చక్కటి ట్రాక్ రికార్డు సొంతం చేసుకున్నారు. దేశం సురక్షితంగా ఉందంటే.. ఇలాంటి ధీరోదాత్త కుటుంబాల వల్లేనే కదా.


మరింత సమాచారం తెలుసుకోండి: