పాపం.. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబుకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఆయన పార్టీ నుంచి వైసీపీలోకి వలసలు ఆగడమే లేదు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థి, పారిశ్రామికవేత్త రఘురామ కృష్ణంరాజు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. హైదరాబాద్ లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ సమక్షంలో ఆయన వైసిపిలో చేరారు.

రామకృష్ణం రాజుకు జగన్ సాదరంగా స్వాగతం చెప్పి కండువా కప్పారు. పార్టీలో చేరిన తర్వాత రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ.. ఏపీ అభివృద్ది చెందాలంటే జగన్ అదికారంలోకి రావాలని అంతా కోరుకుంటున్నారని కామెంట్ చేశారు. టీడీపీ తనకు ఎంపీ టికెట్ ఇచ్చినా... నియోజకవర్గ ప్రజలు తనను వైసీపీలో చేరాలని కోరుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు.

Image result for ramakrishnamraju ysrcp join


ఈ రామకృష్ణంరాజు మొదట్లో వైసీపీలోనే ఉండేవారు.. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి నరసాపురంలో పోటీ చేయాలని భావించారు. కానీ జగన్ టికెట్ ఇవ్వలేదు. దాంతో ఆయన ఎన్నికల ముందు బీజేపీలోకి వెళ్లిపోయారు. ఆ పార్టీ నుంచి పోటీ చేసినా విజయం వరించలేదు.

కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన ఇటీవలే టీడీపీలో చేరారు. ఆ పార్టీ నుంచి నరసాపురం బరిలో నిలవాలని భావించారు. కానీ ఇప్పుడు ఆయన అనూహ్యంగా వైసీపీలో చేరారు. మరి ఈసారైనా జగన్ టికెట్ ఇస్తారా.. రామకృష్ణంరాజు చేరిక వైసీపీకి ఎంతవరకూ మేలు జరుగుతుందనేది ఫ్యూచర్ లో కానీ తెలియదు.


మరింత సమాచారం తెలుసుకోండి: