Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 14, 2019 | Last Updated 8:36 am IST

Menu &Sections

Search

కాశ్మీర్ ను 'భూతాల స్వర్గం' నుంచి 'భూతల స్వర్గం' గా మార్చాల్సిన తరుణమిదే!

కాశ్మీర్ ను 'భూతాల స్వర్గం' నుంచి 'భూతల స్వర్గం' గా మార్చాల్సిన తరుణమిదే!
కాశ్మీర్ ను 'భూతాల స్వర్గం' నుంచి 'భూతల స్వర్గం' గా మార్చాల్సిన తరుణమిదే!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

కాశ్మీర్ మారణ హోమానికి మూలం దేశవిభజనతోనే ముడిపడి ఉంది. అందాల కాశ్మీరంలో సగానికి పైగా భూభాగాన్ని మనం కోల్పోయాం. వివిధ స్థాయులలో తన కుతంత్రాలను ప్రదర్శిస్తూ వచ్చిన పాకిస్తాన్, 80 వ దశకం వచ్చేసరికి కాశ్మీర్ ను హరించడానికి సరికొత్త ప్రణాళికతో, దీర్ఘకాలిక తంత్రాన్ని ఆమలు చేసేదిశగా ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది.

 national-news-kashmir-pak

అలనాటి పాకిస్తాన్ అధ్యక్షుడు “జియా ఉల్ హక్” రూపొందించిన ఆ కుతంత్రమే “ఆపరేషన్ టోపాక్” 

* “ఆయూబ్ ఖాన్”పోకడ “యాహ్యా ఖాన్” కు నచ్చదు

* “యాహ్యా ఖాన్” అంటే “భుట్టో “ కు పడదు

* “భుట్టో” పొడ “జియా ఉల్ హక్” కు గిట్టదు

* “జియా” నీడను కూడా “బేనజీర్” భరించలేదు

* “బేనజీర్”కు “నవాజ్ షరీఫ్” బద్ధ విరోధి

* “నవాజ్ షరీఫ్”కు “ముషారఫ్” బద్ధ శత్రువు 

వీళ్ళందరూ పాకిస్థాన్ పాలకులు. ఒకరిని కూల్చి ఇంకొకరు గద్దెనెక్కినవారు. ఒకరికి ఒకరు బద్ధ విరోధులు. ఐనా సరే కాశ్మీర్ కు సంబంధించినంతవరకూ వీరందరిదీ ఒకటే మాట.. ఒకటే పాట.. ప్రజా ప్రభుత్వామా? లేక సైనిక ప్రభుత్వామా? అన్న తేడా లేదు. వాళ్లమధ్య ఎంత శత్రుత్వము న్నా, ఎన్నో వైరుధ్యాలున్నా, కాశ్మీర్ అంశంలో మాత్రం వీళ్ళందరికీ చక్కటి సారూప్యం ఉంది.. నిలకడైన విధానం ఉంది.

national-news-kashmir-pak 

ఇక మన వ్యవహారం దీనికి పూర్తిగా విరుద్ధం. మనదగ్గర లేనిది ఇదే!.

*  నెహ్రూ అంటే శాస్త్రీ కి గౌరవం

*  శాస్త్రీ అంటే ఇందిరాకు ఆదరం

* ఇందిరా అంటే రాజీవ్ కు ప్రాణం

*  రాజీవ్ అన్నా, నెహ్రూ కుటుంబమన్నా పి‌వి కి ప్రీతి

* మధ్యలో వచ్చి పోయిన మురార్జీ, చరణ్ సింగ్, వి‌పి సింగ్, దేవెగౌడ, గుజ్రాల్ లాంటివాళ్లు, వారికంటూ సొంత విధానం లేకపోయింది.

* ఇక, కాంగ్రెస్ పేరు చెబితే మైల పడ్డట్లు వ్యవహరించే బి‌జే‌పివాళ్ళు, తత్వం బోధపడి కాంగ్రెస్ దారి లోనే ప్రయాణిస్తున్నారు.

national-news-kashmir-pak 

ఇన్నేళ్ల పాలనా కాలంలో కాశ్మీర్ పై మనకంటూ ఒక నిలకడైన విధానం అంటూ ఉండాలి కదా! నిలకడ మాట దేవుడెరుగు. అసలు కాశ్మీర్ పై ఈనాటికీ మన విధానమేమిటో మనకే తెలియని అస్తవ్యస్త పరిస్థితి నెలకొని ఉంది. ఎంత సేపూ, మనం సరైనరీతిలోనే చేస్తున్నట్లు ప్రపంచాన్ని ఎలా నమ్మించాలన్న సందిగ్ధంలోనే ఎన్నో తడబాట్లు, తొట్రుపాట్లు, దిద్దుబాట్లు, భంగపాట్ల తోటే ఏడు దశాబ్దాలు గడిచిపోయాయి.

.

* కాశ్మీర్ విషయంలో ముందు నుండీ న్యాయం మన పక్షానే ఉంది.

* పాకిస్థాన్ ముందు నుండీ అన్యాయంగానే వ్యవహరింసూ ఉంది.

* కాశ్మీర్ మనది మాత్రమే అని చెప్పడానికి మనది తిరుగు లేని కేసు.

* పాకిస్థాన్ దగ్గర అసలు కేసే లేదు.

కేవలం దౌర్జన్యం, దబాయింపు, దుర్మార్గాలతో అడ్డగోలుగా చెలరేగడమే తప్ప, తన వాదనలో బలం లేదని పాక్ కు పూర్తి క్లారిటీ ఉంది.

national-news-kashmir-pak 

తమకు ఏమాత్రం హక్కు లేని కాశ్మీర్ ను వీలైతే కబళించడానికి, లేకపోతే తగుల బెట్టడానికి పాక్ చేయని ప్రయత్నం లేదు. కాశ్మీర్ ఆరని మంటల్లో భారత్ ను ఆరడి పెట్టేందుకు పాక్ ను ఇంత వరకూ ఏలిన పాలుకులందరూ ఏకతాటిమీద నిలిచారు. వారిమధ్య ఎన్ని వైరుధ్యాలున్నా కాశ్మీర్ అంశం వచ్చేపాటికి అందరూ ఏకతాటిపై కొచ్చి వారి కుటిల వ్యూహాలను పకడ్బందీగా అమలు చేస్తూ వచ్చారు.

 

అదే సమయంలో న్యాయపరంగా కాశ్మీర్ ముమ్మాటికీ భారత్ దే  అనడానికి తిరుగు లేకపోయినా, మన జాతీయ ప్రయోజనాలను సంరక్షించు కోవడంలో మన నాయకుల వ్యూహాత్మాక వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంది. ఇది కాదనలేని వాస్తవం.

 national-news-kashmir-pak

కాశ్మీర్ విమోచన అన్నది పాక్ కు జాతీయ లక్ష్యాల్లో ప్రధానమైనది. దాని కోసం వరసగా మూడు యుద్ధాలు (1947, 1965, 1971) కోరి తెచ్చుకొని, చిత్తుగా ఓడిపోయిన పాకిస్థాన్, నేరు గా యుద్ధానికి దిగడం ద్వారా సాధించలేమని అనుభవపూర్వకంగా తెలుసుకొన్న తరువాత, దీర్ఘకాలం మేధో మధనం చేసిన జనరల్ జియా ఉల్ హక్ చాలాకాలం ఆలోచించి, మతోన్మాదం అనే అస్త్రాన్ని ప్రదర్శించాలని పన్నాగం పన్నాడు.

 

అల్లరి మూకలను తయారుచేసి, ఆయుధాలు ఇచ్చి, ముస్లిం మతోన్మాదాన్ని, భారత వ్యతిరేకతను కాశ్మీర్ యువకుల్లో నూరి పోసి, పాకిస్తాన్ లో మిలిటెంట్ శిక్షణలో తర్ఫీదు నిచ్చి భారత్ కు వెనక్కి పంపడం, వారి ద్వారా కాశ్మీర్ లో అంతర్గత కల్లోలాన్ని రేకెత్తించి, దానిని అణచి వేసేందుకు ఇండియా ప్రయత్నిస్తే దారుణ దమనకాండ అంటూ అంతర్జాతీయంగా గగ్గోలు పెట్టి, కుహనా మేధావుల ద్వారా దుష్ప్రచారం సాగించి, మెల్లగా కాశ్మీర్ ను ఇండియా నుండి వేరు చేసి తాము కబళించడం ఒక్కటే తెలివైన మార్గం అని తీర్మానించాడు.

national-news-kashmir-pak

ఆపరేషన్ టోపాక్

అలా తన మెదడులో పురుడుపోసుకొన్న ఈ కుటిల తంత్రాన్ని, 18-ఏప్రిల్-1988 వ తేదీన ఇస్లామాబాద్ లో అతిరహస్యంగా జరిగిన మిలిటరీ కోర్ కమాండర్ల సమావేశంలో జనరల్ జియా ఉల్ హక్  విపులీకరించి, తదుపరి ప్రణాళికను వివరించాడు. ఇదే ప్రసంగాన్ని తదుపరికాలంలో “జమాతే ఇస్లామీ” సంస్థ “హిజ్బే ఇస్లాం” పుస్తకంలో ప్రచురించి, పాక్ భక్త కాశ్మీరీలకు రహస్యంగా పంచిపెట్టింది.  ఆపరేషన్ టోపాక్ అన్న పేరుతో పిలవబడ్డ ఈ పథకాన్ని మూడు దశల్లో అమలుచేయడం మొదలుపెట్టారు.

మొదటి దశ

1. జమ్మూ కాశ్మీర్ లో తక్కువ స్థాయిలో తిరుగుబాటు తేవాలి. అది ఎలా ఉండాలంటే, ప్రభుత్వం అష్ట దిగ్బంధం కావాలి.  కానీ కూలి పోకూడదు

2. మన మనుషులను ప్రభుత్వంలోని కీలక స్థానాల్లో ఉంచాలి. పోలీసు బలగాలు, ఆర్థిక సంస్థలు, కమ్యూనికేషన్ - నెట్వర్క్, వంటి వాటిని చడీచప్పుడు లేకుండా గుప్పిట్లోకి తెచ్చుకోవాలి

3. విద్యార్థుల్లో, రైతుల్లో మతపరమైన అంశాలమీద భారత వ్యతిరేకత భావాలను రెచ్చగొట్టాలి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలను, అల్లర్లను వారిద్వారా సాగించగలగాలి. సైనికుల అత్యాచారాలను, మానవహక్కుల ఉల్లంఘనలను, ముస్లింలపై దాడులను నిరసిస్తూ పెద్దఎత్తున నానాయాగీ చేయాలి.

4. పారా మిలిటరీ సాయుధ బలగాలతో తలపడడానికి కాశ్మీరీ యువకులకు తర్ఫీదునివ్వాలి. మనకు ఉపయోగపడేవారిని జాగ్రత్తగా ఎంపిక చేసి ఆయుధాల ప్రయోగంలో శిక్షణ ఇచ్చి, మన భావాలను నూరిపోసి ఇండియా మీదికి ఉసి గొల్పాలి

5. జమ్మూకు-కాశ్మీర్ కు మధ్య, కాశ్మీర్ కూ-లాడాక్ కూ మధ్య కమ్యూనికేషన్లు నాశనం చేయాలి. ఈ పనిని గుట్టుగా కానివ్వాలి. కాశ్మీర్ నుండి దృష్టి మళ్ళించడానికి సిక్కు తీవ్రవాదుల సహాయం తో జమ్మూలో అల్లర్లతో అల్లకల్లోలాన్ని సృష్టించాలి. హిందువుల్లో కూడా ప్రభుత్వమంటే ఏవగింపు కలిగించాలి.

6. కాశ్మీర్ లోయ లో భారత సైన్యం మోహరించని ప్రాంతాలను ముఖ్యంగా దక్షిణ కాశ్మీర్ ను క్రమేణా మన ఆధీనంలోనికి తెచ్చుకోవాలి.

రెండోదశ 

1. సియాచిన్, కార్గిల్, రాజౌరి, పూంఛ్ సెక్టార్లలో సాధ్యమైనంత ఒత్తిడి కల్గించడం ద్వారా, భారత సైన్యం కాశ్మీర్ లోయకు వెలుపల బలగాలను మోహరించేలాగా చేయాలి. కాశ్మీర్ లో శ్రీనగర్, కుప్వారా, బారాముల్లా, బందీపూర్, చౌకీవాలా ల్లో ఒకేసారి కోవర్ట్ యాక్షన్ తో దాడిచేసి సైనిక ప్రధాన స్థావరాలను, బేస్-డిపోలను ధ్వంసంచేయాలి. 

2. ఆజాద్ కాశ్మీర్ లో స్థిరపడ్డ ఆఫ్గాన్ ముజాహిదీన్లు కొందరు ఈలోగా కాశ్మీర్ లోయలో ఒక క్రమ పద్దతిలో జాగ్రత్తగా చొరబడి, మన పలుకుబడిని విశాల ప్రాంతాలకు విస్తరించాలి 

3. ఆఖరిగా ఆజాద్ కాశ్మీర్ లోని పాక్ రిటైర్డ్ సైనిక అధికారులు, హార్డ్ కోర్ ఆఫ్గాన్లు కలిసి కాశ్మీర్ పై దాడిచేసి విమానాశ్రాయాలు, రేడియో స్టేషన్లను ధ్వంసం చేస్తారు. బానిహాల్ టన్నెల్ ను, కార్గిల్- లేహ్ హైవే ను మూసివేయాలి. పంజాబ్ లోనూ, కాశ్మీర్ చుట్టుప్రక్కల ఇతరప్రాంతాల్లోనూ ఇదేసమయంలో అంతర్గాన కల్లోలం తేవాలి.

national-news-kashmir-pak

మూడోదశ

1 కాశ్మీర్ లోయను విముక్తి చేసి, స్వతంత్ర ఇస్లామిక్ రాజ్యం ఏర్పాటు చేసేందుకు  తదుపరి బృహత్ ప్రణాళికను అమలు చేయాలి.

2 ఇదీ “ఆపరేషన్ టోపాక్”పేరుతో పాకిస్థాన్ భారత్ పై ప్రయోగించిన “మతోన్మాద ఉగ్రవాద లేదా తీవ్రవాద పోరాటం”     

3 ఇందులో ఇప్పటికే మొదటి దశ ఎప్పుడో విజయవంతంగా పూర్తయి పోయింది.. రెండోదశ చాలా వేగంగా  విస్తరిస్తూ ఉంది. ప్రస్తుతం కాశ్మీర్ లో నడుస్తున్నదిదే. “ఆపరేషన్ టోపాక్”రెండోదశ – నేటి కాశ్మీర్ ముఖచిత్రం. ప్రపంచ దేశాలన్నీ చేరి పాకిస్తాన్ ను ఉగ్రవాద దేశం గా ప్రకటించాలని కోరుకునే నరేంద్ర మోడీ సర్కార్ భారత పార్లమెంటులో అటువంటి ప్రతిపాదన చేయాలి.

national-news-kashmir-pak

పలువురు ప్రముఖులు వివిధ సంధర్భాల్లో చేసిన ఈ క్రింది చర్యల్ని కూడా వెంటనే చేపట్టడం మంచిది:

1 పాకిస్తాన్ లోని భారత రాయబారిని వెనక్కు పిలిపించాలి. ఇక్కడి పాక్ రాయబారిని బహిష్కరించాలి.

2 ఆర్టికల్ 370ని వెంటనే రద్దు చేయాలి. ఇందుకు పార్లమెంట్ అనుమతి అవసరం లేదు. దీనిని వ్యతిరేకించేవాళ్ళు ఎవరైనా ఉంటే వారిపై న్యాయపరమైన చర్యల్ని తీసుకోవచ్చు.

3 పాకిస్తాన్ తో సాగిస్తున్న అన్ని లావాదేవీల్ని వెంటనే ఆపివేయాలి. ఇక్కడున్న పాకిస్తానీయుల్ని తిప్పి పంపించాలి. అక్కడున్న భారతీయుల్ని వెనక్కు తీసుకురావాలి.

4 శిక్షకు గురైన తీవ్రవాదుల్నిసమర్థించినా, కాశ్మీరు వేర్పాటు వాదాన్ని సమర్థించినా అది నేరం అని తీర్మానిస్తూ ఒక ఆర్డినెన్స్ జారీచేయాలి. ఇందుకుగాను బూజు పట్టిన పాత చట్టాన్ని సరి చేయ కుండా ఒక కొత్త చట్టాన్ని తీసుకురావాలి.

5 శ్రీనగర్ లోని లాల్ చౌక్ లో భారత పతాకాన్ని ఎగురవేయాలి. జమ్మూ కాశ్మీరులోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంపై త్రివర్ణ పతాకం ఎగరాలి. పాకిస్తాన్, ఐఎసైఎస్  జెండాల్ని ఎగరేసే వాళ్ళని, ఇతర తీవ్రవాద సంస్థల జెండాలను ఎగరేసే వాళ్ళని శిక్షించాలి.

national-news-kashmir-pak 

6 కాశ్మీర్ ప్రాంతంలో సైనిక పాలనను విధించాలి. మన సైన్యం అంగుళం అంగుళం జల్లెడ పట్టాలి.

7 నలుగురి కంటే ఎక్కువ మంది గుంపు కట్టటం నిషేధించాలి. ఉల్లఘించిన వాళ్ళను - కనిపిస్తే కాల్చివేత - పద్ధతిని అమలు చేయాలి. శాంతి, సహనం, క్షమ వంటివి ఇప్పుడు పనికి రావు.

8 కాశ్మీర్ ప్రాంతం నుండి మీడియాను దూరం పెట్టాలి.  పనికిమాలిన స్వచ్ఛంద సంస్థలని దేశం నుండి తరిమేయాలి. ఇంటర్నెట్, మొబైల్ సేవల్ని రద్దు చేయాలి. కేవలం లోకల్-కాల్స్ అది కూడా లాండ్-లైన్స్ ద్వారా మాత్రమే అనుమతించాలి.

9 ఎస్టిడి, ఐఎస్‍డి-కాల్స్ ను టెలిఫోన్ ఎక్స్ ఛేంజ్ ద్వారా మాత్రమే అనుమతించాలి. అన్ని ఫోన్ కాల్స్ ను క్షుణ్ణంగా గమనించాలి. నేరపూరిత కాల్స్ చేసిన వాళ్ళను వెంటనే అదుపు లోకి తీసుకోవాలి.

10 వేర్పాటువాదులు అందర్నీ అరెస్ట్ చేయాలి. ఇందులో ఎవరికీ మినహాయింపు నివ్వరాదు. వీళ్ళు కాశ్మీరులో ఉన్నా, ఇంకెక్కడైనా ఉన్నా వెంటనే అదుపు లోకి తీసుకోవాలి. కాశ్మీర్ బయట ఎక్కడై నా బంధించాలి. కాశ్మీర్ వేర్పాటుపై ఇష్టం వచ్చినట్టుగా స్పందించడాన్ని తగ్గించాలి.

11 భారత ప్రభుత్వ అనుమతి లేకుండా ఏ రాజకీయవేత్త, స్వచ్ఛంద సంస్థ కాశ్మీరులో ప్రవేశించ కుండా నిరోధించాలి. ఎందుకంటే కాశ్మీర్ ను ఆరని చిచ్చుగా మార్చాలనే రాజకీయ వేత్తలు, సంస్థలు బోలెడున్నాయి.

 national-news-kashmir-pak

విషాదకరమైన ఘటన నేపధ్యంలో ఏవరు ప్రధానిలో గానీ, ప్రభుత్వంలో గానీ లోపాలను వెదికే ప్రయత్నం చేయకూడదు. పుల్వామా ఘటన పట్ల దేశభక్తుల్లో పెల్లుబుకుతున్న ఆవేశం ఖచ్చితంగా ప్రధాని నరేంద్ర మోడీలో కూడా ఉంది.

 

ఆయనకు మద్దతుగా మనం నిలబడాల్సిన సందర్భం ఇది. అయితే ప్రధాని కూడా ఎటువంటి కఠినచర్య తీసుకోవడానికి కూడా వెనుకాడకుండా, తడబడ కుండా ప్రతిస్పందించాలి. ఇస్లామిక్ తీవ్రవాదుల్లా భారతీయులు రక్త పిపాసులు కారు. ప్రతీకారం, ఎదురు దాడుల మాట తర్వాత.

 

మృతవీరులకు దక్కాల్సిన న్యాయం కూడా సమయానుకూలంగా అందించవచ్చు. అయితే మొదటగా – కాశ్మీరులో ఇంతవరకూ జరిగింది చాలు -  చాలంటే చాలు - బూజు పట్టిన, తుప్పు పట్టిన, మొద్దు బారిన పాత పద్ధతులను పక్కన పెట్టాల్సిందే.

 

కొత్త వ్యూహాలకు, సరికొత్త ఎత్తుగడులకు ఇదే సరైన సమయం. కాశ్మీర్ లోపల వెలుపల ఉన్న భారత దేశ ద్రోహులు, కాశ్మీరు వేర్పాటు వాదులు, షాకుకు గురయ్యేలా, ఆశ్చర్యపోయేలా, ఉలిక్కి పడేలా, విలవిల్లాడేలా, ఒళ్ళు గగుర్పొడిచేలా, దేశం అంటే దాని సార్వభౌమత్వంవైపు కన్నెత్తి చూసినా, పన్నెత్తి మాట్లాడినా, కనీసం దేశం పట్ల దుర్మార్గంగా ఆలోచించినా కఠిన చర్యలు అవీ ఎలా ఉండాలంటే అనుభవించిన వాణ్ణి ఆ విధంగా ఆలోచించేవాడి మదిలో మరణమృదంగ ద్వని మోగించాల్సిన సమయం వచ్చేసింది. 

national-news-kashmir-pak

సమాచార సేకరణ పిఆర్కే 

national-news-kashmir-pak's-operation-topaz
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అబద్ధాలాడే కేసీఆర్ ది పక్కా దోర మనస్తత్వం : విజయశాంతి & ప్రొ. కోదండరాం
తలసాని, పువ్వాడ లాంటి అవకాశవాదులకు నిలయం కేసీఆర్ కాబినెట్: ఆర్టీసీ ఉద్యోగులు
కేసీఆర్ చెవిలో ఇక ప్రతిక్షణం రాజకీయ బాజా మోతలే!
ఇదే ఆర్ధిక మాంద్యం దెబ్బ - నడి సముద్రంలో పరిశ్రమ ! కల్లోల కడలిలో ఆటోమొబైల్ ఉద్యోగులు
కేసీఆర్ పాలనకు కష్టకాలం దాపురించినట్లేనా! నగరవాసులు సున్నం పెట్టటానికి రడీగా ఉన్నారా!
ఆర్థిక మాంద్యమా! నీవెక్కడ? 3 సినిమాల లాభాలే సాక్ష్యం!
“శ్రీరాముడిని వదిలేసినా! శ్రీరాముడు వదిలేసినా!” మునిగిపోక తప్పదు
ఆర్టీసీ తరవాత కేసీఆర్ లక్ష్యం రెవెన్యూయేనా? అయితే జనం ఓట్లు కేసీఆర్ కే!
వివాహేతర సంభందం నేఱం కాదన్న, సుప్రీం తీర్పు శిరోధార్యమా?
ముద్దు ముద్దుకు తేడా ఉంది - మురిపించే అదృష్టం నాకే ఉంది
కేసీఆర్ పాలనలో ఓటర్లు కూడా 'సెల్ఫ్-డిస్మిస్' అవుతారేమో? : విజయశాంతి
వజ్రం లోపల మరో వజ్రం - ప్రపంచ అద్భుతం
పొరుగు దేశాలు - పాక్, చైనా - రెండింటికి భారత్ తీవ్ర హెచ్చరిక
అన్నీ మంచి శకునములే: మందగమనం ఉన్నా భవిష్యత్ ఆశాజనకం: ఐటీసి
జగన్ పై ప్రతిపక్షాల పొగడ్తల వరద - హుజూర్నగర్ ఉపఎన్నిక మద్దతులో టీఅరెస్ కు సీపీఐ ఝలక్?
జస్టిస్ చంద్రకుమార్ సంచలనం: కేసీఆర్ ది నోరా? మోరీనా?
కేంద్రం సంచలన నిర్ణయం: ఒక్కో కుటుంబానికి ₹5.50 లక్షలు ప్రయోజనం
"ఐదు ట్రిలియన్ డాలర్ ఏకానమి" గా భారత్ - వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో వక్తలు
ఆర్ధిక సంక్షోభానికి ఇదేమైనా దారితీస్తుందా?
రాజ్ నాధ్ ఆయుధ పూజ - రఫేల్ గగన విహారం - పాక్ గుండెల్లో రైళ్ల పరుగులు
About the author