ఏపీ కేబినెట్‌లో కీల‌క మంత్రిగా చ‌క్రం తిప్పుతున్న దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు ప‌రిస్థితి వ‌చ్చే ఎన్నిక‌ల్లో చాలా దారు ణంగా ఉండ‌నుందా? ఆయ‌న ప‌రిస్థితి ఏటికి ఎదురీద‌వ‌ల‌సిందేనా?  అంటే.. తాజాగా ఉమా ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియో జ‌క‌వ‌ర్గంలో ప‌రిస్థితిని అంచ‌నా వేస్తే.. ఔన‌నే అనిపిస్తోంది. కృష్ణాజిల్లా మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస విజయా లు సాధించిన దేవినేని ఉమా.. తాను తీసుకున్న గోతిలో తానే ప‌డుతున్నారు. వ‌రుస విజ‌యాలు ఆయ‌న‌కు ఆకాశం నుంచి ఊడిప‌డ్డాయ‌ని భావించారు. కానీ, క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఏ రేంజ్‌లో క‌ష్ట‌ప‌డితే దేవినేని విజ‌యం సాధించార‌నే విష‌యం తెలుస్తుంది. కానీ తాను అధికారంలోకి వ‌చ్చాక మాత్రం వారిని ప‌క్క‌కు పెట్టారు.


క‌నీసం ప‌ట్టించుకోలేదు. పైగా ఎవ‌రినీ ద‌గ్గ‌ర‌కు కూడా రానీయ‌లేదు. ఇక‌,  2014లో మంత్రి అయ్యాక ఇక‌, రాష్ట్ర స్థాయి నాయకుడిగా, మంత్రిగా మారిపోయి నియోజ‌క‌వ‌ర్గంపై పూర్తిగా శీత‌క‌న్నేశారు. ఎవ‌రు వ‌చ్చి ఏ స‌మ‌స్య చెప్పినా ప‌ట్టించుకో క పోవ‌డం, అన్నింటినీ లైట్‌గా తీసుకోవ‌డం వంటి ప‌రిణామాలు మంత్రిని పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు, దిగువ స్థాయి నేత‌ల‌కు దూ రం చేసింది. ఇక‌, ప్ర‌జ‌ల ప‌రంగా చూసుకున్నా.. ఇక్క‌డ స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకుని ప‌రిష్కారం చేయ‌డంలో మంత్రి విఫ ల‌మయ్యార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. అస‌లు నియోజ‌క‌వ‌ర్గంలోనే ఉండ‌కుండా ఆయ‌న రాజ‌కీయాలు చేస్తున్నార ని అనేవారు కూడా ఉన్నారు. ఇక్క‌డ ఉమా గ‌త రెండు ఎన్నిక‌ల్లో గెలిచినా 2009లో ఆయ‌న ప్ర‌త్య‌ర్థి ఎవ‌రో నియోజ‌క‌వ‌ర్గంలోనే చాలామందికి తెలియ‌ని ప‌రిస్థితి. గ‌త ఎన్నిక‌ల్లో అప్ప‌టి వ‌ర‌కు పెడ‌న ఎమ్మెల్యేగా ఉన్ జోగి ర‌మేష్‌కు ఇక్క‌డ‌కు చివ‌ర్లో రావ‌డంతో ఆయ‌న గెల‌వ‌లేదు. అయినా జోగి ఉమాకు చివ‌రి వ‌ర‌కు గ‌ట్టి పోటీ ఇచ్చారు.


ఇలా ఇటు పార్టీ, అటు ప్ర‌జ‌ల నుంచి కూడా దేవినేని వ్య‌తిరేక ప‌వ‌నాలు ఎదుర్కొంటున్నారు. ఇదిలావుంటే, వీట‌న్నింటి కంటే మించిన మ‌రో శ‌త‌ఘ్ని.. వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్‌. మంత్రి దేవినేని ఉమా సామాజిక వ‌ర్గానికే చెందిన వ‌సంత‌.. ఉమా ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పార్టీ టీడీపీ నుంచే బ‌య‌ట‌కు వ‌చ్చి.. వైసీపీలో చేరి వ‌చ్చే ఎన్నిక‌ల్లో మైల‌వ‌రం నుంచి పోటీ చేసేందుకు ఇప్ప‌టికే అన్ని విధాలా గ్రౌండ్ వ‌ర్క్ పూర్తి చేసుకున్నాడు. ఆర్థికంగా చాలా బ‌లంగా ఉండ‌డమే కాకుండా కేడ‌ర్ ప‌రంగాకూడా వ‌సంత మంచి బ‌లంగా ఉండ‌డం, క‌మ్మ సామాజిక వ‌ర్గంలో వ‌చ్చిన చీలిక మెజారిటీ నాయ‌కులు వ‌సంత‌కు జై కొడుతుండ‌డం వంటి ప‌రిణామాలు కూడా మంత్రి దేవినేనికి ఎదురు గాలులు వీచేలా చేస్తున్నాయి. ఈ ప‌రిణామాల‌ను నిశితంగా గ‌మ‌నిస్తే.. మంత్రి దేవినేనికి ఈ ద‌ఫా గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కైతే కాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: