అభినందన్ వర్థమాన్.. ఇటీవలి కాలంలో ఇంతగా పాపులర్ అయిన వ్యక్తి ఇంకొకరు లేరు. భారత సైనికుడి ధైర్యసాహసాలకు ఆయన ప్రతీకగా నిలిచారు. ఇప్పుడు అభినందన్ ఓ బ్రాండ్ గా మారిపోయారు. శతృదేశానికి చిక్కిన కూడా ఎక్కడ భయపడక ఎదురోడ్డి నిలబడి తిరిగి స్వదేశానికి చేరుకున్నాడు.

 Image result for abhinandan vardhaman


ఇప్పుడు  అభినందన్‌ సాహస గాథను రాజస్థాన్‌ విద్యార్ధులు ఇకపై పాఠ్యాంశంగా చదువుకొనున్నారు. అభినందన్‌ గౌరవార్ధం పాఠ్యాంశంగా చేర్పించాలని రాజస్థాన్‌ ప్రభుత్వం భావిస్తోంది. అభినందన్‌ స్టోరీని స్కూల్‌ పాఠ్యపుస్తకాల్లో చేర్చాలంటూ రాజస్థాన్‌ విద్యాశాఖ మంత్రి గోవింద్‌ సింగ్‌ ప్రతిపాదించారు.

 Related image


 ఐఏఎఫ్‌ పైలట్‌ అభినందన్‌ జోధ్‌పూర్‌లోనే విద్యాభ్యాసం చేసినట్లు మంత్రి గోవింధ్‌ ఇవాళ ట్విట్టర్లో పేర్కొన్నారు. వైమానిక దాడుల సమయంలోనూ, ఆ తర్వాత అభినందన్‌ కనబర్చిన ధైర్య సాహసాలకు గుర్తింపుగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి ప్రకటించారు. ఆయనను గౌరవించేందుకే రాజస్థాన్‌ స్కూల్‌ సిలబస్‌లో అభినందన్‌ జీవిత చరిత్రను పొందుపర్చనున్నట్లు వెల్లడించారు.

 Image result for abhinandan vardhaman


మంత్రి చేసిన ప్రతిపాదనకు ఇప్పటికే రివ్యూ కమిటీ నుంచి ఆమోదం లభించింది. రాజస్థాన్ సర్కారు తీసుకున్న ఈ చొరవ మెచ్చుకోతగింది. మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అభినందన్ కథను విద్యార్థులకు అందించడం ద్వారా స్ఫూర్తి నింపినవారు అవుతారు. That is spirit of indian army.


మరింత సమాచారం తెలుసుకోండి: