తెలంగాణలో జర్నలిస్టులకు స్వేచ్చ లేదని ఏపీ సీఎం చంద్రబాబు కామెంట్ చేశారు. సైబర్‌ చట్టం ప్రకారం అందరికీ దండన ఉండాల్సిందేనని.. ఓట్లు తొలగించి రాజకీయం చేస్తున్నవారందరినీ శిక్షించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణలో జర్నలిస్టులకు కూడా స్వేచ్ఛలేదని.. గొంతెత్తి ప్రశ్నించడం తాను చూడలేదన్నారు.

 chandrababu vs sakshi కోసం చిత్ర ఫలితం


ప్రజాస్వామ్యం అంటే అదేనా? అని ఈ సందర్భంగా తెలంగాణ సర్కార్‌ను ఆయన పరోక్షంగా ప్రశ్నించారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ అదే వేదికపై చంద్రబాబు సాక్షి మీడియా ప్రతినిధిపై నోరు పారేసుకున్నారు. డేటా చోరీ కేసుపై మీడియా సమావేశంలో సాక్షి ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పేందుకు నిరాకరించారు.

సంబంధిత చిత్రం


మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటూ సాక్షి ప్రతినిధిపై సీఎం మండిపడ్డారు. అయితే మరోసారి ప్రశ్న అడిగేందుకు ప్రయత్నించిన సాక్షి ప్రతినిధిని ...ఒకసారి చెబితే వినాలంటూ సీఎం హెచ్చరించారట.
ప్రభుత్వ మీడియా సమావేశాన్ని చంద్రబాబు పార్టీ ప్రెస్‌మీట్‌గా చెప్పారు.

chandrababu vs sakshi కోసం చిత్ర ఫలితం


మీరు పిలిస్తేనే మీడియా సమావేశానికి వచ్చామని సాక్షి ప్రతినిధి తెలిపారు. అసలు మిమ్మల్ని ప్రభుత్వ సమావేశాలకు కూడా రానివ్వనంటూ చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబుతో పాటు మంత్రులు కాల్వ శ్రీనివాసులు, కళా వెంకట్రావు కూడా రెచ్చిపోయారు. చేయి చూపిస్తూ కుర్చోవాలని బెదిరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: