ఆయన ఏపీకి ఉపముఖ్యమంత్రి.. అంతే కాదు.. ఏపీ హోం మంత్రి కూడా.. కానీ ఆయన ఓ ఉత్సవ విగ్రహం మాత్రమేనని చాలామంది మీడియా విశ్లేషకులు అంటుంటారు. ఆయన చాలా ప్రెస్ మీట్లలో తడబడుతుంటారు. పెద్దగా విషయం కూడా ఉండదు. అలాంటి చినరాజప్ప.. కొత్త వాదనలో జనం మతి పోగొడుతున్నారు.  

 chinarajappa images కోసం చిత్ర ఫలితం

 

ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటా ఏమాత్రం లీక్ కాలేదని, తెలంగాణ ప్రభుత్వం ఏపి ప్రజలను అనవసర గందరగోళానికి గురి చేస్తోందని హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప కామెంట్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అబ్బే .. ప్రభుత్వ డేటా లీక్ కాలేదు.. తెలుగుదేశం పార్టీ డేటా లీక్ అయ్యిందేమో అంటూ ఆయన కామెంట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ డేటా లీక్ కాలేదు కాబట్టే తాము ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు.


అంతే కాదు.. అసలు ఏపి డేటా లీక్ అయినట్లు తెలంగాణ వాసి ఫిర్యాదు చేయడమేమిటని చినరాజప్ప ప్రశ్నించారు. మా ప్రభుత్వ వ్యహారం పై తెలంగాణ ప్రభుత్వం సిట్ వేయడమేనిటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కు దమ్ముంటే ప్రజలతో ఓట్లు వేయించుకొని గెలవాలని సవాలు విసిరారు.

chinarajappa images కోసం చిత్ర ఫలితం


ప్రజల ఓట్లు తొలగించేందుకు జగన్ కు ఏం హక్కు ఉందంటూ ప్రశ్నించారు. తెలంగాణలో ఫిర్యాదు వస్తే విచారణ చేయడం సాధారణమని హోంమంత్రికి తెలియదా.. సిట్ వేయడానికి ఏ ఏ రూల్స్ ఉంటాయో కూడా హోంమినిస్టర్ కు తెలియదా.. అసలు ప్రజల ఓట్లు జగన్ రద్దు చేసే అవకాశం ఉందా.. ఏంటి చినరాజప్పగారూ.. మిగిలిన అందిరిలాగానే హోంమంత్రి కూడా మాట్లాడితే ఎలా..?


మరింత సమాచారం తెలుసుకోండి: