చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్న కేసీఆర్ ఆ గిఫ్టను వివిధ మార్గాల్లో ఇస్తున్నారు. జగన్ కు సహకారం.. ఏపీ సర్కారుపై కేసులు.. డేటా విషయం.. ఇలా ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ ఇబ్బందిపెడుతున్నారు. రాజకీయంగా చాణక్యుడిగా పేరున్న చంద్రబాబుసైతం ఈ టార్చర్ భరించలేకపోతున్నట్టు ఆయన మాటల్లో వెల్లడవుతోంది.


 

 

ఆయన ఇటీవల చేస్తున్న కామెంట్స్ ఆయన బేల తనాన్ని సూచిస్తున్నాయి. నాపై ఎన్ని ఆరోపణలు చేస్తున్నారు. నేను నీతివంతంగా, పారదర్శకంగా జీవితం గడిపాను. నాపైనే బురదజల్లేసి మానసికంగా క్షోభ పెడుతున్నారు. నేను ఒక ఆశయం కోసం పోరాడుతున్నాను కాబట్టి వీటిని లెక్క చేయడం లేదు.

 

 

అందరూ మాట్లాడతారుగానీ, ధైర్యంగా పోరాడలేరు.. అంటూ సెల్ఫ్ పిటీ కోసం ట్రై చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. మీరే పోరాటం చేద్దామనుకుంటే.. మీ భార్య నీకెందుకులే ఊరుకో అంటుంది. మీరు నన్ను ఇన్ని అడుగుతున్నారు కదా? ఢిల్లీలోను, తెలంగాణలోను ఎందుకు మాట్లాడటం లేదు. ఇదేనా ప్రజాస్వామ్యం? అంటూ విలేకరుల సమావేశంలో తెగ బాధపడిపోయారు చంద్రబాబు.



మరిఇన్ని రకాలుగా వేధిస్తుంటే సాధారణ పౌరుడిలా ఆయన బాధపడిపోతారేంటి.. ఆయన ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అన్న విషయం మరిచిపోయి బేలగా మాట్లాడతారేంటి.. ఒకవేళ కేసీఆర్ టార్చర్ పెడితే చంద్రబాబు ఏం చేస్తున్నారు.. ఆసలు కేసీఆర్ టార్చర్ పెట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది..? ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెబుతారో..?

 


మరింత సమాచారం తెలుసుకోండి: