స్టీఫెన్ రవింద్ర విధినిర్వహణలో అత్యంత కఠినాత్ముడు నిక్కచ్చి అని పేరుంది. నిజాయతీ కూడా ఉంది. అలాంటివ్యక్తి  సమాచారచౌర్యానికి మారుపేరైన ఐటీ గ్రిడ్ సంస్థ సీఈఓ...అశోక్ దాకవరపు ఎక్కడ ఉన్నా అది అమరావతి అయినా అమెరికా అయినా పట్టేస్తామని శపథం చేయటం చాలా ఆశ్చర్యం కలిగించింది. కారణం ఈ కాలపు విధి నిర్వాహకులు భీష్ముడంతటి వారు కానేరరు. కారణం ప్రభుత్వాలే నేఱగాళ్ళ కొమ్ముకాస్తూ చాలంజ్ చేస్తున్న కాలమిది. రవీంద్ర సామర్ధ్యాన్ని శంఖించ లేము అందులో అనుమానం లేదు. 

Related image

అశోక్ ఎక్కడ దాక్కున్నా పొగపెట్టి కలుగులోని ఎలుకను బయటకు తేగల ఆయన సమర్ధత పోలీస్డి పార్ట్మెంట్ కు బాగాతెలుసు. ఇలాంటి శపథమే కాస్త తక్కువ ద్వనిలో చెప్పారు అకున్ సబర్వాల్ డ్రగ్స్ కేసు విచారణ సమయంలో. అలాగే ఓటుకు నోటు కేసులో తెలంగాణా ముఖ్యమంత్రి చెప్పిన మాటలు సవాళ్ళు జనాలకు తెలియవా? అలాగే  గోల్డ్ స్టొన్ భూకబ్జాలు, నయీం భూకబ్జాల కేసులు  ఏమయ్యయో ఏమాత్రం అర్ధంకాదు. మన సమాజం మొత్తం రాజకీయ అవసరాల చుట్టూ గుండ్రంగా తిరుగు తుంది. అశోక్ అనే మాయలపకీర్ ప్రాణం సార్వబౌముని కోటలోని అంతఃపురం లోని అల్మైరా లో ఉండగా స్టీఫెన్ రవీంద్రుని శపథాలు గాలిమాటలు కాక మరేమౌతుంది.   

Related image

ప్రస్తుతానికి స్టీఫెన్ రవీంద్ర శపధం కార్యరూపం దాల్చే అవకాశాలు లేవు. సాధారణ పరిస్థితుల్లో  స్టీఫెన్ రవీంద్ర లాంటి పోలీసులు తలచుకుంటే 'అపరాధ పరిశోధన'  సాధ్యం కానిది ఏమీ ఉండదు. విధి నిర్వహణలో సీదాగా కఠినంగా వ్యవహరించే ఈ పోలీస్ దుర్భేధ్యమైన కేసుల చేదనలోనూ ఇప్పటికే తనదైన ముద్ర వేసుకునారు. ప్రెసిడెంట్ మెడల్స్ కూడా దక్కించున్న చరిత్ర రవీంద్రది ఆయన తలస్తే సాధ్యం కాని పనేదీ ఉండదనే చెప్పాలి.


అయితే అశోక్ ను అరెస్ట్ చేసే విషయంలో మాత్రం స్టీఫెన్ రవీంద్రకు చాలా రాజకీయ అడ్డంకులు ఎదురవనున్నాయనే చ్హెప్పాలి. ఎందుకంటే, అశోక్ తాను నెలకొల్పిన ఐటీ గ్రిడ్ ను ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీగా ఉన్న టీడీపీకి సేవలందించేందుకు వినియోగించారు. ఆయన టీడీపీ ఆదేశాల మేరకు వ్యవహరించారు. ఈ కేసులో స్టీఫెన్ రవీంద్ర చెప్పినట్టుగా అశోక్ పట్టుబడితే, మొత్తం టిడిపి అధినేత రాజకీయగుట్టు రట్టవడమే కాకుండా, అసలు సూత్రధారులు? పాత్రధారులు? అసలు సమాచార చౌర్యం ఏ స్థాయిలో జరిగింది? అన్న అంశాలు అతి సునాయాసంగా బళ్ళున బయటకు వస్తాయి.


నేఱపూరిత కార్యక్రమం కోసమే, కోట్లు దండుకోవటానికే, టిడిపి అధినేతల పనులు నెరవేర్చి తెలుగుదేశం పార్టీకి ఓటర్ల ఓట్లు వారి యిష్టానికి వ్యతిరేఖంగా తరలించటానికి జన్మించిన ఐటి గ్రిడ్ అధిపతి అశోక్ ను టీడీపీ ప్రభుత్వమే కాపాడుతుందని అనేక టెలిజన్ చర్చల్లో అత్యంత సీనియర్లైన తెలుగుదేశం ప్రజాప్రతినిధులు నిర్భయంగా చెప్పేస్తున్నారు. అలాంటి ఇనుపకచ్చడాల వలయంలో హాయిగా సేదతీరుతున్న అశోక్ అంత తెలిగ్గా  రవీంద్ర బృందాలకు బంగారు పళ్ళెంలో పెట్టి అందిస్తారా? అవసరమైతే  శివార్పణం అంటారేమో గాని....!

Image result for stephen ravindra Vs Data Theft case

తెలంగాణలో కేసు నమోదు అయిన తక్షణమే హైదరాబాద్ లో ఉండే అశోక్, అదృశ్యమైపోయాడు. నిజంగా ఈ కేసులో ఎవరి ప్రయోజనాలకు భంగం కలుగుతుందో వారే నాలుగు దశాబ్ధాల రాజకీయ అనుభవం ఉండి భారత ప్రధానినే నువ్వెంత అన్నట్లు ఢీ కొడుతున్న ఒక రాజకీయపార్టీ చక్రవర్తి. సిబిఐ లాంటి కేంద్ర విచారణ సంస్థల ప్రవేశాన్ని రాష్ట్రంలో నిరోధించిన నియంత. ప్రజాస్వామ్యం ఆయన చేతిలో ఒక పిపీలికం. స్వప్రయోజనాలే లేకపోతే ఆఫ్ట్రాల్ ఒక ఐటి కంపనీ అధినేత కోసం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన హోదా వదలి రోడ్దున పడటం సిగ్గుచేటు కాదా!  రాష్ట్ర ప్రయోజనాలకంటే ప్రజా సంరక్షణ కంటే ఐటి గ్రిడ్స్ లాంటి చోటా కంపనీ యజమాని ప్రయోజనాలు ఎక్కువైనాయి ముఖ్యమంత్రికి. బహుశ ప్రజాభిప్రాయం ప్రకారం అశోక్ పై పోలీస్ అదీ స్టీఫెన్ రవీంద్ర బృందం విచారిస్తే లోకెష్ జైలుకే పరిమితమై పోతాడని భయమేమో ఆ అధినేతకు. 


రవీంద్ర ఎంతమేర మాటల తూటాలు పేల్చినా అశోక్ చిరునామా సాధించి దొరికించుకున్నా,  మాయల పకీర్ ప్రాణం రాజకీయ నాయకుడి గుండె లోనో కోట లోని అంతఃపురం లోనో ఉంటుంది.

Image result for TV 9 discussion on data theft case

రాత్రి టివి 9 చర్చావేదికలో పాల్గొన్న టిడిపి అధికార ప్రతినిధి ముళ్ళపూడి రేణుక స్థానంలోకి మధ్యలో వచ్చిన "ఏపి ప్రభుత్వ ఐటి సలహాదారు" ప్రత్యక్షంగానే అశోక్  తనను తాను పోలీసుల నుండి రక్షించుకోవటానికి సరంజామా చేకూర్చుకొని రైట్ రాయల్ గానే బయటకు వస్తాడని బహిరంగంగానే చెప్పారు. అంతేకాదు తెలంగాణ పోలీసుల అనుమానం మేరకు, అతడు ఆంధ్రప్రదేశ్ సార్వభౌముని అభ్యంతర మందిరంలోనే పదిలంగా ఉన్నాడని తెలుస్తోంది. అంతెందుకు వైసీపీ-టీఆర్ఎస్ నేతలు అశోక్ ఏకంగా చంద్రబాబు - లోకేశ్ ల వద్దే ఉన్నారని అంటున్న మాటలూ వినిపిస్తున్నాయి.


ఈ క్రమంలో అశోక్ కోసం ఏపీకి వస్తే, తెలంగాణ పోలీసులకు చుక్కలు చూపించాల్సిందేనని టీడీపీ అంతర్గత సమావేశంలో ఆ రాష్ట్ర సార్వభౌముడు ఏకంగా తీర్మానించి నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కోల్కతాలో నగర కమిషనర్ గా ఉన్న పోలీసు అధికారిని విచారించేందుకు ఎంట్రీ ఇచ్చిన సీబీఐ అధికారులకు పశ్చిమ బెంగాల్ పోలీసులు ఏ రీతిన చుక్కలు చూపించారో, అదే తరహాలో తెలంగాణ పోలీసులకు చుక్కలు చూపించమన్నట్లు సార్వభౌముని ఆఙ్జగా టీడీపీ నేతలు చెబుతున్నారు.

Image result for TV 9 discussion on data theft case

ఇదంతా చూస్తుంటే ప్రజాస్వామ్యాన్ని దుర్మార్గపు పాలకుల దౌష్ట్యం నుండి ప్రజాస్వామ్యాన్నిప్రజలే కాపాడు కోవాలని అంటున్నారు. ప్రజాజీవితాలని, వారి వ్యక్తిగత  సమాచారాన్ని గుప్పెట్లో పెట్టుకొని పాలింప జూస్తున్న అధినెతల అధికారానికి చరమగీతం పాడటం ప్రజాస్వామ్యానికి చాలా అవసరం.


ఐటి గ్రిడ్ అశోక్ లాంటి వాళ్ళు చాలా సురక్షిత వలయంలోనే ఉంటారు కాబట్టి-అశోక్ ను పట్టేయడం స్టీఫెన్ రవీంద్రకు అంత సులభం కాదు అనే వాదన వినిపిస్తోంది. అయితే ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా అశోక్ ను  జైలుపాలు చేస్తామని చెబుతున్న స్టీఫెన్ రవీంద్ర ఆ ర్ఫాష్ట్రంలోకి ప్రవేశిస్తే మాత్రం ఇరు పోలీస్ వర్గాల మద్య సమరం తప్పదన్న విశ్లేషణలూ మొదలయ్యాయి.


అందుకే ఈ సమాచార చౌర్యం కేసు కూడా ఓటుకు నోటు కేసు, నార్కోటిక్స్ & డ్రగ్స్ కేసు జాబితా లోకి చేరిపోతుందని ఉభయ రాష్ట్రాల ప్రజల విశ్వాసం

Image result for TV 9 discussion on data theft case

మరింత సమాచారం తెలుసుకోండి: