ఏపీ సీఎం చంద్రబాబు మాటలు భలే విచిత్రంగా ఉంటాయి. సభను బట్టి.. సందర్భాన్ని బట్టి అవి మారిపోతుంటాయి. ఆ మధ్య చంద్రబాబును బీజేపీ జైల్లో పెట్టిస్తుందన్న టాక్ వచ్చింది.. అప్పట్లోచంద్రబాబు కూడా ప్రతి ప్రెస్ మీట్లోనూ నన్ను జైల్లో పెట్టిస్తారట అంటూ చెప్పుకునేవారు.

 à°¸à°‚బంధిత చిత్రం

ఆ సమయంలోనే ఆయన డ్వాక్రామహిళల గురించి మాట్లాడుతూ.. మీరే నాకు అండ.. ఈ అన్నయ్యకు ఏమైనా అయితే మీరే కాపాడుకోవాలి అంటూ బేలగా మాట్లాడారు. మీ అండ ఉన్నంత వరకూ తనను ఏమీ చేయలేరని చెప్పుకొచ్చారు. ఇప్పుడు క్రమంగా సీన్ మారింది.. మహిళాదినోత్సవం రోజు చంద్రబాబు మాట్లాడుతూ.. మహిళలకు రక్షణగాతాను నిరంతం ఉంటానంటున్నారు.

chandrababu with dwakra కోసం చిత్ర ఫలితం


ఆడబిడ్డల జోలికి ఎవరైనా వస్తే అదే వారికి ఆఖరి రోజు అవుతుందని చంద్రబాబు హెచ్చరించారు. ప్రతి మహిళ కనక దుర్గలా ధైర్యంగా ఉండాలని పేర్కొన్నారు. మాతృమూర్తులను గౌరవించే కార్యక్రమాలు తెచ్చామన్న చంద్రబాబు.. మహిళల కోసం రక్ష పథకం కింద 120 కోట్ల వ్యయంతో శానిటరీ నాప్‌కిన్స్ ఇచ్చామని గుర్తు చేశారు.  మహిళల హక్కులు కాపాడేందుకు మహిళా కమిషన్ వేశామన్నారు.


సంబంధిత చిత్రం

ఆర్ధికంగా మహిళలను పైకి తేవడమే కాకుండా ఆత్మగౌరవంతో జీవించే ఏర్పాట్లు చేస్తున్నామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. తనకు కోటి మంది మహిళా సైన్యం ఉందన్న చంద్రబాబు వారిని ప్రపంచంలో అజేయశక్తిగా మలుస్తానని స్పష్టం చేశారు. తన ఇంట్లో మహిళా సాధికారత చేసి చూపించానన్న చంద్రబాబు, ప్రతి ఇంటిలోనూ ఇదే స్పూర్తి కనబరచాలని పిలుపు ఇచ్చారు. మరి ఇంతకూ చంద్రబాబు మహిళలకు రక్షణగా ఉంటారా...ఆయనకే మహిళలు రక్షణగా ఉంటారా.. ?


మరింత సమాచారం తెలుసుకోండి: