విశాఖ జిల్లా.. ఏపీ ఎన్నికల్లో కీలకమైన జిల్లాల్లో ఇది ఒకటి. గత ఎన్నికల్లో ఇక్కడ సైకిల్ కమలం జోడీ సత్తా చాటింది. ఈ జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ జిల్లాలో వైవిధ్యభరితమైన ఓటర్లు ఉంటారు. ఉత్తర భారతదేశం నుంచి, ఇతర జిల్లాల నుంచి వచ్చిన వలస జీవులు ఎక్కువగా ఉంటారు.



ఈ జిల్లాలో ఓ సర్వే కంపెనీ ఇటీవల వెల్లడించిన సర్వే వివరాలు మరీ షాకింగ్ గా ఉన్నాయి. ఈ సంస్థ అంచనా ప్రకారం ఈ జిల్లాలో తెలుగుదేశం పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇక్కడ తెలుగుదేశం మొత్తం 15 స్థానాల్లో కనీసం ఒక్క స్థానంలో కూడా మొదటి స్థానంలో లేకపోవడం షాక్ ఇస్తోంది.

vizag political survey కోసం చిత్ర ఫలితం


ఇక సెకండ్‌ ప్లేస్‌లో ఉన్న స్థానాలు కూడా ఒక్కటే కావడం మరో షాక్. ఇక మిగిలిన 14 స్థానాల్లో మూడో స్థానంలో ఈ పార్టీ ఉంది. ఇక వైసీపీ విషయానికి వస్తేఈ జిల్లాలో 8 స్థానాల్లో వైసీపీ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. మరో 6 స్థానాల్లో సెకండ్ పొజిషన్లో ఉంది. ఒక స్థానంలో మూడో పొజిషన్ లో ఉంది.

vizag political survey కోసం చిత్ర ఫలితం


ఇక జనసేన పార్టీ విషయానికి వస్తే.. ఈజిల్లాలో 7 స్థానాల్లో జనసేన మొదటి స్థానంలో ఉంది. మరో 6 స్థానాల్లో సెకండ్ పొజిషన్లో ఉంది. మరో 2 స్థానాల్లో చివరి స్థానంలో ఉంది. నిజంగా ఈ ఫలితాలు షాకింగ్ కలిగిస్తున్నాయి. జనసేన ఒక జిల్లాలో ఫస్ట్ ప్లేస్ లో ఉండటం కూడా ఇదే మొదటిసారి.


మరింత సమాచారం తెలుసుకోండి: