స్టీఫెన్ రవీంద్రను తరచుగా డేర్ డెవిల్ అంటూ ఉంటారు సహ పొలీస్ అధికారులు, వృత్తిలో ఆయనను ఎరిగినవారు, అనేక సందర్భాల్లో ఆయన అచీవ్మెంట్స్ గమనించి నవారు. కారణం విధి నిర్వహణలో ఆయన స్వార్ధ రహిత సామర్ధ్యంతో పాటు,  ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా సమాజానికి ఆపత్కాలంలో ఆయన  కదన రంగాన దూకగలడు. అత్యంత ప్రమాదకరమైన ఒక ఆసుపత్రి అగ్నిప్రమాదం నుంది 61 మంది రోగుల ప్రాణాలు కాపాడిన చరిత్ర ఆయనది. దానికి ఆయనను భారత్ "ప్రధాని లైఫ్ సేవింగ్ మెడల్" ఇచ్చి సత్కరించింది.

Image result for stephen ravindra medals

"అవకాశం దొరికినప్పుడలా ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర - పోలీసులు బాధ్యతాయుతంగా పనిచేసి ప్రజలకు జవాబుదారిగా వ్యవహరించాలని - చెపుతూ వారిని ప్రోత్సహిస్తూ   ఉంటారు అదే గుణం అందుకే ఆయనను పోలీసులు అందరివాడని అంటారు. నేరాల తీరును, నేరాల అదుపునకు పోలీసులు తీసుకుంటున్న చర్యలను ఎల్లవేళలా అడిగి తెలుసు కుంటూ వారి లోని వృత్తి పట్ల నిబద్ధతను మెచ్చుకొని వారిని ప్రోత్సహిస్తారు. పోలీసులు వ్యక్తిగత క్రమశిక్షణ కలిగి ఉండాలనేది ఆయన విధానం.

Image result for ktr harish stephen ravindra

సంఘటన జరిగిన వెంటనే స్పందించి సమాజంలో పోలీసుల గౌరవాన్నిపెంపొందించే క్రమంలో పనిచేయాలని వృత్తి ధర్మం ప్రాధమ్యంగా ఉండాలనేది ఆయన తత్వం అంటారు ఆయన కొలీగ్స్. పోలీసు అధికారులు సాంకేతిక పరిజ్ఞానం తెలిసి ఉండటమేకాదు దానిలో నైపుణ్యం సాధిస్తే విధి నిర్వహణ అద్భుతంగా ఉంటుందని అంటారు.

Image result for stephen ravindra a dynamic police officer

ఆయన సాధించిన విజయాలను పరిశీలిస్తే ఆయనొక ఆల్ రౌండరే నని చెప్పొచ్చు. ఆయన వరంగల్ జిల్లా ఎస్పిగా నక్సలిజాన్ని ఎదుర్కొన్నారు. అనంతపురం ఎస్పిగా ఉన్నప్పుడు ఫాక్షనిజాన్ని విజయవంతంగా ఎదుర్కొన్నారు. కరీమ్నగర్ ఎస్పిగా అవినీతిపై పోరాడి, తెలంగాణ ఆంధ్ర ప్రాంతీయ వాదం కూడా ఎదుర్కొన్నారు. ఆయన ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ తన విధి నిర్వహించిన దాఖాలాలు ఉన్నాయి. అలాగే హైదరాబాద్ ఈస్ట్ జొన్ డిసిపి గా ఉన్నప్పుడు నక్సల్ తెర్రరిస్ట్ గ్రూప్ కమాండర్గా గ్రేయ్ హౌండ్స్ లో పని చేశారు. ఆ రోజుల్లో వెస్ట్ జొన్ లో పని చేసినప్పుడు రోజూ డ్రగ్స్ రవాణా చెసే వాళ్లని అరస్ట్ చేసిన వార్తలే ఉండేవి. ఆయన హై-రిస్క్ తీవ్రవాదా వ్యతిరెఖ చర్యలలో ఆయన విధానం ఎన్నో ప్రశంసలు అందుకుంది 'గ్యాలంట్రీ మెడల్' తీసుకున్న చరిత్ర కూడా ఉంది.

Image result for stephen ravindra a dynamic police officer

నాటి టిఆరెస్ ఎమెల్యే హరీష్ రావుతో వృత్తిపర విభేదాలతో దాదాపు యుద్ధమే చేశారని అంటారు. 1980 లో ప్రతిష్టాత్మక  'ముంబై డ్రగ్స్ కేస్ డీల్' చేసిన కమీషనర్ ఆఫ్ పోలీస్ జె ఎఫ్ రబెరో డిప్యూటీ కమీషనర్ వైసి పవార్ తో - హైదరాబాద్ కమీషనర్ ఆఫ్ పోలీస్ ఏ కె ఖాన్ డిప్యూటీ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర - డ్రగ్స్ పై సమరం చేసిన విధానాన్ని పోల్చేవారు.

Image result for swarnajit sawang stephen

ఇక్కడ స్టీఫెన్ రవీంద్ర ఒక ఉత్తమ పోలీస్ అధికారిగా తీర్చిదిద్దబడిన సందర్భంలో మనం గుర్తించాల్సిన కీలక వ్యక్తులు మాత్రం నాటి డిప్యూటి ఐజి ఆఫ్ పోలీస్ వరంగల్ రేంజ్ డిజి సవాంగ్,  ఏపి డిజిపి హైదరాబాద్  స్వర్ణజిత్  సేన్ .

Image result for stephen ravindra medals

"స్వర్ణజిత్-సవాంగ్-స్టేఫెన్ కొలీగ్-షిప్" (అంటే వృత్తిగత సాహచర్యం) నాడు వరంగల్ జిల్లాలో నక్సలైట్ల తీవ్రవాద నేరాలు పూర్తిగా అణచబడ్దాయంటే - ఫ్రంట్ ఎండ్ లో వ్యూహాలు నిర్మించి నిర్వహించిన స్టీఫెన్ రవీంద్ర అని చెప్పక తప్పదు.  మొత్తం మీద  2016 లో ప్రెసిడెంట్ మెడల్ లభించింది ఇవే ఆయన వృత్తి పట్ల నిభద్దతను సూచిస్తుంది.

స్టీఫెన్ రవీంద్ర ముక్కుసూటి తనానికి ఆనాటి ఉదాహరణ 


స్టీఫెన్ రవీంద్ర..మొండితనానికి, ముక్కుసూటి తనానికి, నిజాయితీకి మారుపేరైన అధికారిగా ఆయనకు ఉమ్మడి రాష్ట్రంలో పేరుంది. ఎక్కడ..ఏ ప్లేస్‌లో పోస్టింగ్ ఇచ్చినా సమర్థవంతంగా పనిచేయడం ఆయన స్టైల్.  తెలంగాణ ఉద్యమ సమయంలో మనోడి పేరు ఓ రేంజ్‌లో వినపడింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులపై దౌర్జన్యాలకు దిగి తెలంగాణవాదుల నుంచి కర్కోటకుడు అన్న పేరు పొందారు . అలాంటి స్టీఫెన్ రవీంద్ర మళ్లీ వార్తల్లోకెక్కారు . పరిపాలనా సౌలభ్యం, భద్రతల పరిరక్షణ కోసం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌ను ఈస్ట్ , వెస్ట్‌గా విభజించింది తెలంగాణ ప్రభుత్వం. దానికి పలువురు ఐపీఎస్ అధికారులను కేటాయించింది.

 

అలా స్టీఫెన్ రవీంద్రను సైబరాబాద్ వెస్ట్ జాయింట్ కమిషనర్‌గా నియమించింది. ప్రభుత్వోద్యోగులు అన్నాకా ట్రాన్స్‌ఫర్‌లు ఉంటాయి..సస్పెన్షన్‌లు ఉంటాయి దీనిలో పెద్ద వింతేముంది అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది పెద్ద కథ. సైబరాబాద్ వెస్ట్ జాయింట్ కమిషనర్‌గా స్టీఫెన్ రవీంద్రను మంత్రి కేటీఆర్ ఏరి కోరి తెచ్చుకున్నారు. హైదరాబాద్‌లో ఐటీని అభివృద్ధి చేయాలనుకుంటున్న కేటీఆర్. విదేశాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. విదేశాలు ఇక్కడ పెట్టుబడులు పెట్టాలంటే  తమ ఉద్యోగుల భద్రత విషయానికి పెద్ద పీట వేస్తున్నాయి. అలాంటి కీలకమైన ఐటీ కారిడార్‌ లో భద్రతా విధులు పర్యవేక్షించాలంటే సమర్థుడైన అధికారి ఉండాలని భావించిన కేటీఆర్ అందుకు తగిన వ్యక్తిగా స్టీఫెన్ రవీంద్రను భావించారు.

 

అయితే ఈ నిర్ణయం కేటీఆర్ బావ, మరో మంత్రి హరీశ్‌రావుకు రుచించలేదు. ఎందుకంటే హరీశ్‌రావుకు..స్టీఫెన్ రవీంద్రకు మధ్య జరిగిన కోల్డ్‌వార్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకవైపు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, మరోవైపు సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో విద్యుత్ సౌధ లోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించిన హరీశ్‌రావు ను అప్పుడు డీసీపీ గా ఉన్న స్టీఫెన్ రవీంద్ర తన సిబ్బందితో అడ్డుకున్నారు. దీనిపై ఆగ్రహించిన హరీశ్ స్టీఫెన్‌ పట్ల దురుసుగా ప్రవర్తించడం తో పాటు "ఇడియట్",  "యూజ్‌లెస్ ఫెలో" అంటూ అసభ్య పదజాలంతో దూషించారు. దీనికి సంబంధించిన వీడియో అప్పట్లో హల్‌చల్ చేసింది. అలాంటి స్టీఫెన్ రవీంద్ర ను కేటీఆర్ ఏరికోరి ఎంచుకోవడంపై హరీశ్‌రావు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. స్టీఫెన్‌ విషయంలో మనసు మార్చుకోవాలని హరీశ్, కేటీఆర్‌కు సూచించగా, దానికి కేటీఆర్ ససేమిరా అన్నట్లు సమాచారం. చివరికి ఈ పంచాయతీ అటు తిరిగి ముఖ్య మంత్రి కేసీఆర్ వద్దకు చేరింది. ఉద్యమంలో ఇవన్నీ మామూలే, రాష్ట్రాభివృద్ధి కోసం కేటీఆర్ నిర్ణయాన్ని సమర్థించకతప్పదు అంటూ కేసీఆర్, హరీశ్‌రావుకు చెప్పినట్లు తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: