విజయనగరరం జిల్లా.. ఉత్తరాంధ్రలో మారుమూల జిల్లా.. ఈ జిల్లాలో గత ఎన్నికల్లో తెలుగుదేశమే పై చేయి సాధించింది. ఈ జిల్లాలో మొత్తం 9 అసెంబ్లీ స్థానాలు ఉంటే.. 2014 లో తెలుగుదేశం 6 స్థానాల్లోనూ.. వైసీపీ 3 స్థానాల్లోనూ విజయం సాధించాయి. మరి ఈసారి ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే అంశంపై ఓ సర్వేసంస్థ తన తుది ఫలితాలు వెల్లడించింది.

 



ఆ సంస్థ సర్వే ప్రకారం.. విజయనగరం జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీ ఒక్క చోట కూడా మొదటి స్థానంలో లేకపోవడం విశేషం. మూడు స్థానాల్లో మాత్రం రెండో స్థానంలో ఉంది. మరో 6 స్థానాల్లో తెలుగుదేశం మూడో స్థానంలో ఉంది. ఇక ప్రతిపక్ష వైసీపీ ఈ జిల్లాలో దూసుకుపోతోందని చెప్పాలి.

Vizianagaram politics కోసం చిత్ర ఫలితం



వైసీపీ మొత్తం 9 స్థానాల్లోనూ మొదటి స్థానంలో నిలిచింది. ఇక మరో పార్టీ జనసేన విషయానికి వస్తే.. ఈ పార్టీ ఒక్క స్థానంలో కూడా మొదటి స్థానంలో లేకపోయినా రెండు చోట్ల మాత్రం రెండో స్థానంలో ఉంది. మరో 7 స్థానాల్లో మూడో స్థానంలో ఉంది. ఈ సర్వే ప్రకారం మొదటి, రెండు స్థానాల మధ్య తేడా 10 వేల ఓట్ల వరకూ తేడా ఉండొచ్చు.

Vizianagaram politics కోసం చిత్ర ఫలితం



సో.. ఈ సర్వే వివరాలను బట్టి చూస్తే.. అధికార తెలుగుదేశం పార్టీ మహా గెలిస్తే.. రెండు, మూడు స్థానాల కంటే ఎక్కువ వచ్చే ఛాన్స్ లేదు. ఇక వైసీపీ మాత్రం మొత్తం 9 స్థానాల్లోనూ ఆధిక్యం ప్రదర్శిస్తోంది. సో.. 7 నుంచి 9 స్థానాలు గెలిచుకోవచ్చు. ఇక జనసేన మహా అయితే ఓ స్థానం గెలిచే ఛాన్స్ ఉందన్నమాట. ఇదీ విజయనగరం కథ.



మరింత సమాచారం తెలుసుకోండి: