ప్రముఖ నటి జయసుధ ఇటీవల వైసీపీలోచేరిన సంగతి తెలిసిందే. ఆమె మొదట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చొరవతోనే రాజకీయాల్లోకి వచ్చారు. సికింద్రాబాద్ స్థానం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో ఉన్నా అంత చురుగ్గా లేరు. తర్వాత కొన్నాళ్లుకు టీడీపీకి వచ్చారు.

 à°¸à°‚బంధిత చిత్రం


మళ్లీ ఇప్పుడు వైసీపీలోకి చేరారు. అయితే జయసుధ చేరిక వెనుక తెలంగాణ మంత్రి కేటీఆర్ హస్తం ఉందంటున్నారు ఓ ప్రముఖ పత్రిక సంపాదకుడు ఆర్కే. ఆయన తన తాజా వ్యాసంలో ఈ విషయం బయటపెట్టారు. అంతే కాదు.. తన రాతలను కేటీఆర్ కాదనగలరా అంటూ సవాల్ కూడా విసిరారు ఆర్కే.

jayasudha join ysrcp కోసం చిత్ర ఫలితం


ఆయన ఏం రాశారంటే.. సినీనటి జయసుధ వైసీపీలో చేరారు. నిజానికి ఆమెకు జగన్‌ పార్టీలో చేరాలన్న ఆలోచన లేదు. తెలంగాణ యువరాజు కేటీఆర్‌ కొద్దిరోజుల క్రితం జయసుధకు ఫోన్‌ చేసి జగన్‌ను కలిసి వైసీపీలో చేరాలని కోరారట అంటూ తన పత్రికలో రాసుకొచ్చారు ఆర్కే.

 à°¸à°‚బంధిత చిత్రం


మొదట్లో వైసీపీలో చేరేందుకు జయసుధ నిరాకరించారట. చివరకు జయసుధ ఒత్తిళ్లకు తలవంచక తప్పలేదట. ఇది నిజం కాదని కేటీఆర్‌ చెప్పగలరా ? అంటూ సవాల్ విసిరారు.మరి ఇదే నిజమైతే.. వత్తిళ్లకు తలవంచక తప్పని పరిస్థితి జయసుధకు ఏం ఉంటుంది. ఆమేమీ పారిశ్రామిక వేత్త కాదే.. ఆ విషయం కూడా ఆర్కే రాస్తే బావుండేదేమో కదా.


మరింత సమాచారం తెలుసుకోండి: