ఎన్నికల నగారా మోగింది. ఏప్రిల్ 11 ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ జరగబోతోంది. అంటే సరిగ్గా ఎన్నికలకు నెల రోజులే సమయం ఉంది. ఎన్నికల సర్వేలన్నీ చంద్రబాబుకు వ్యతిరేకంగానే వస్తున్నాయి. ఈ సమయంలో చంద్రబాబుకు ఒకే ఒక్క ఆశాకిరణంగా కేసీఆర్ కనిపిస్తున్నారు.

 

అదేంటి కేసీఆర్ చంద్రబాబు శత్రువు కదా.. ఆయన ఎలా సాయం చేస్తాడంటారా.. అదే ఇప్పుడు అసలు ట్విస్టు.. జగన్, కేసీఆర్ కుమ్మక్కయ్యారని ప్రచారం చేయడం ద్వారా ఏపీలో సెంటిమెంట్ రగల్చాలని చంద్రబాబు బాగా తాపత్రయపడుతున్నారు. ఇందుకు అందివచ్చిన అవకాశంగా డేటా చోరీ వివాదాన్ని వాడుకుంటున్నారు.

 

నాకు కేసీఆర్ ఒక రిటర్న్ గిఫ్ట్ ఇస్తే.. నేను తిరిగి 100రిటర్న్ గిఫ్ట్ లు ఇస్తా.. జగన్ ఒక్క సీటు గెలిచినా కేసీఆర్ జేబులోకి వెళ్లినట్టే అంటూ కేసీఆర్ కు వ్యతిరేకంగా ఏపీలో సెంటిమెంట్ మంటలు రాజేస్తున్నారు. జగన్, కేసీఆర్ కు బానిస అంటూ ప్రచారం ఊదర గొడుతున్నారు.

 

ఏపీకి అన్యాయం చేసిన కేసీఆర్, కేంద్రంతో కుమ్మక్కైన జగనుకు ఓటు అడిగే హక్కే లేదని చంద్రబాబు గర్జిస్తున్నారు. మరి ఈ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా.. తెలంగాణలో అంటే చంద్రబాబు వెళ్లి మరీ ప్రచారం చేశారు కాబట్టి కేసీఆర్ కు సెంటిమెంట్ వర్కవుట్ అయ్యింది. మరి ఏపీలో ఏం జరుగుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: