రావణాసురుని గుట్టు విభీషణుడికి తెలుసు. అందుకే శ్రీరామచంద్రుడు సైతం రావణసంహారంలో విభీషణుడు తనకైతాను విప్పిన ఇంటిగుట్టు చెప్పిన రావణ రహస్యాలతో ఆయన్ని అంత మొందించాడు. ఇది ఇది ఇతిహాసం - అంటే నిజంగా జరిగిందని అర్ధం.
Image result for BJP Lakshman & Nadella Bhaskara rao
అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలుసు ఈ కాలపు సామెత. నారా చంద్రబాబు నాయుడు, నాదేళ్ళ భాస్కరరావు సహాయం పొందుతూ కాంగ్రెస్ లో పై కొచ్చినవాడు. లోగుట్టు పెరుమాళ్ళ కెరుక అన్న సామెత ప్రకారం మూలాలు ఒకటే కావటంతో  చంద్రుని చరిత్ర భాస్కరుడికి తెలుసు అందుకే మూడు దశాబ్ధాలుగా మూలన పడున్న భాస్కరాస్త్రాన్ని రాజకీయాల్లో చంద్రబాబు కు వ్యతిరేఖంగా కనీసం ఏవరూ ప్రయోగించకపోవటం కొంత ఆశ్చర్యకరమైన విషయమే! 
Image result for nadella bhaskara rao enters in BJP
ఈ ఆలోచన ఎవరూ చేయలేదా! ఎవరికీ రాలెదా!  పాపాలకూపంలో, అబద్ధాల చట్రంలో, దినదినం జీవించే ముఖ్యమంత్రికి సరైన గుణపాఠంచెప్పే అవకాశాన్ని ఇప్పుడా  అస్త్రాన్ని చేజిక్కించుకొని భారతీయ జనతాపార్టీ సద్వినియోగం చేసుకోబోతోందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలవేడి ఏడేడు భువనాలను తాకుతూ వస్తుంది. ముఖ్యం గా ప్రతిపక్ష వైసీపీ – అధికార పక్ష టీడీపీ నువ్వా? నేనా? అనేట్లు ప్రచార పర్వంలో ముందుకు దూసుకెళ్తున్నారు.
Image result for nadella bhaskara rao enters in BJP
మళ్లీ అధికారం దక్కించు కోవాలని ఆధునిక రాజకీయ మాయావిగా పేరొంది - ఉండవల్లి అన్నట్లు కడవరకు అలసిపోని పోరాటం సలిపే నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ప్రయత్నాలు ప్రారంభించగా, ఒక్క చాన్స్ అంటే "ఒకే ఒక్క అవకాశం ఇచ్చి చూడండి" అంటూ మహాభారతంలో అస్త్రశస్త్ర సాధనకోసం అర్జునుడు తప్పస్సు చేసిన విధంగా ఈ భువి చవిచూడని, రాజకీయ నాయకుడూ చేయని సుధీర్ఘ పాదయాత్ర ద్వారా "శాసనసభలో సాధ్యంకాని దాన్నిప్రజాక్షేత్రంలో ప్రజలకు చేరువ కావటం ద్వారా సంపాదించిన వైఎస్ జగన్మోహనరెడ్ది - ప్రజలను అర్ధిస్తున్నాడు. 

Image result for nadella bhaskara rao enters in BJP

అందుకే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రణక్షేత్రంలో వ్య్యుహకర్తల అవసరం ఎంతో ఉంది. ఒక వైపు ఆయుధం ముట్టని శ్రీకృష్ణునిగా కేసీఆర్ వ్యూహాన్ని అల్లటంలో జగన్ కు సహాయ పడుతున్నట్లు కనిపిస్తూనే ఉండటం కాదు చంద్రబాబు నోరు బాదేసుకుంటున్నారు కూడా! మరోవైపు బిజేపి భాస్కరాస్త్ర ప్రయోగం జరిగితే మాత్రం ఆధునిక కురుక్షేత్రంలో చంద్రబాబుకు దుర్యోధనునికి పట్టినగతే పడుతుందనేది అనేది నిశ్చయం.    

Image result for nadella bhaskara rao enters in BJP
ప్రస్తుతం అందుతున్న ప్రాంతీయ జాతీయసర్వేల సమాచారం ప్రకారం జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడు బీజీపీ వ్యూహకర్తలు మాస్టర్-స్కెచ్ వేసినట్లు సమాచారం. గత కొంత కాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావును రాజకీయ వెలుగులోకి బీజేపీ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుందని సమాచారముంది. 
Image result for nadella bhaskara rao enters in BJP
తాజాగా నాదేళ్ళ భాస్కరరావు ఇంటికి తెలంగాణ బీజీపీ అధ్యక్షుడు లక్ష్మణ్ వెళ్లారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితి పై రెండు గంటల పాటు చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రధాని నరేంద్రమోదీ పనితీరుపైనా మాట్లాడి, నాదెండ్లను బీజేపీలోకి లక్ష్మణ్‌ ఆహ్వానించినట్లు తెలుస్తుంది. లక్ష్మణ్ ఆహ్వానానికి సానుకూలం గా స్పందించిన నాదెండ్ల ఆలోచించి చెబుతానని అన్నట్టు సమాచారం. 
Image result for T BJP Lakshan went to Nadella bhaskara rao
అయితే ఉన్నట్టుండి నాదెండ్ల భాస్కర రావును తమ పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ ప్లాన్ చేయడం వెనుక అసలు "టార్గెట్ సిఎం మాత్రమే కాదు నారా చంద్రబాబు నాయుడు రాజకీయ చరమ గీతం"  అని పలువురు విశ్లేషిస్తున్నారు. మరి ఈ ఎన్నికల రణక్షేత్రంలో నాదేళ్ళ భాస్కరరావు దిగుతారా! దిగితే రాజకీయ సమీకరణాలు ఎలా మారిపోతాయి? అనేది ప్రాధమిక చర్చగా మారింది. మరోపక్క నాదేళ్ళ భాస్కరరావు తనయుడు మాజీ సభాపతి నాదేళ్ళ మనోహర్ జనసేన పార్టీలో ఉన్న సంగతి తెలిసిందే.

Image result for BJP Lakshman & Nadella Bhaskara rao

ఇక ఇదే సమయంలో జాతక రీత్యా తెలుగుదేశం పార్టీకి శనిగండం మొదలు కానున్నదని అంటున్నారు పండితులు. ఈ నెల ముగింపు సమయం నుంచి తెలుగుదేశం పార్టీ శని దశ మొదలు కానున్నదట. అది కొన్ని రోజుల పాటు సాగుతుందట! ఎంత వరకూ అంటే ఎన్నికల పోలింగ్, ఫలితాలు వచ్చేవరకని అని కొందరు జ్యోతీష్య పండితులు చెబుతూ ఉన్నారు!

Image result for nadella bhaskara rao as Sanidraham to chandrababu now

ఇది టీడీపీకి అంత మంచి దశకాదు అని అలాంటి దశలో పురోగమనం ఉండదని టీడీపీ పై ఆ ప్రభావం తప్పదని వారు హెచ్చ రిస్తూ ఉన్నారు. ఎన్నికల సమయంలో తెలుగు దేశం పార్టీకి ఇలాంటి దశ రావడం, సరిగ్గా అదే సమయంలో నాదేళ్ళ భాస్కర రావు బిజేపిలో ఎంట్రీ యివ్వనుండటం ఆ పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులను సృష్టిస్తుందని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: