ఏపీలో కాపు సామాజికవర్గానికి ప్రతినిధిగా ఉండే వంగవీటి రాధా తాజాగా తెలుగుదేశం పార్టీ తీర్ధం పుచ్చుకున్న విషయం తెలిసిందే. వైసీపీలో జగన్ తనకు అన్యాయం చేశాడని ఆరోపిస్తూ...ఆయన చంద్రబాబు సమక్షంలో టీడీపీ జెండా కప్పుకున్నారు. అలాగే తనకి పార్టీలో పదవులు అక్కర్లేదని తన తండ్రి వంగవీటి రంగా ఆశయం అయిన విజయవాడలోని పేద ప్రజలకి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి చంద్రబాబు ఒప్పుకున్నారని అందుకే తాను టీడీపీలో చేరానని చెప్పారు. అలాగే తన తండ్రి హత్యకి టీడీపీకి ఎటువంటి సంబంధం లేదని ఆయన చెప్పుకొచ్చాడు. ఇక రాధాని ఏదొక కాపు సామాజికవర్గ ప్రభావం ఎక్కువ ఉన్న ఏదొక పార్లమెంట్ స్థానం నుండి బరిలోకి దించాలని చంద్రబాబు యోచిస్తున్నారు.


ఇదిలా ఉంటే వంగవీటి రాధా టీడీపీలో చేరడాన్ని ఆయన బాబాయ్ నారాయణరావు కుమారుడైన వంగవీటి నరేంద్ర పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. రంగా హత్యకు కారణమైన టీడీపీలో  రాధాకృష్ణ చేరడం చాలా బాధకరమని, రాధాకృష్ణ నిర్ణయం వల్ల రంగా మరోసారి హత్యకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తూ.... నరేంద్ర ఈరోజు విజయవాడ రాఘవయ్య పార్క్ లోని రంగా విగ్రహం వద్ద దీక్షకి దిగారు. అయితే పోలీసులి వచ్చి నరేంద్ర దీక్ష భగ్నం చేయడంతో...అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.


ఇక ఈ సందర్భంగా నరేంద్ర రాధాపై విరుచుకుపడ్డారు. తన తండ్రిని చంపిన పార్టీలో రాధా బాబు చేరడం బాధాకరమని, గతంలో టిడిపి తన అధికార బలాన్ని ఉపయోగించి వంగవీటి మోహన రంగాను దారుణంగా నడి రోడ్డుపై నరికి చంపారని ఆరోపించారు. టీడీపీ పార్టీ రాధా బాబు మెడలో వేసిన కండువాను ఉరి తాడుగా భావిస్తున్నామని, తనకు టీడీపీతో ప్రాణ హాని ఉందని రంగా పదే పదే చెప్పిన మాటలను వంగవీటి నరేంద్ర గుర్తు చేశారు. మరి తమ్ముడి వ్యాఖ్యలకి రాధా ఎలా స్పందిస్తారో ? చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: