మహా నాయకుల వారసులల మల్లే రాజకీయాలలోకి నారా లోకేష్ ఎపుడూ రాలేదు. పార్టీ అధికారంలో ఉండి కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలవలేని ఈ చినబాబు పెద్దలసభలో దొడ్డిదారిన ఎపుడైతే ప్రవేశించారో ఆనాటి నుండి టీడీపీ విజయాల మీదే నీలినీడలు కమ్ముకున్నాయి. అందుకే ఆయనపై విమర్శలు వస్తూంటాయి. 
Image result for lokesh contesting finally from mangalagiri
ఇపుడు అసలైన ఎన్నికల సమయంలో లోకెష్ గెలుపుకు చేయాల్సినదంతా చేస్తున్నారు. ఎక్కడో రాయల సీమ జిల్లాలకు చెందిన నారా లోకేష్ ఉత్తరాంధ్ర వైపు రావడమే షాక్. అలా వచ్చి మామూలుగా కాకుండా విపరీతమైన హైప్-క్రియేట్ చేసి మొత్తం మూడు జిల్లాలు లోకేష్ ఆగమనంతో ఉత్సాహం పొంగిపొరలినట్లు గంపగుత్తగా ఓట్లన్నీ పడి సీట్లన్నీ తెలుగుదేశం పార్టీకే పడి పోతాయ‌ని విపరీతమైన బిల్డప్ ఇచ్చుకోవడం మరో ఆశ్చర్యకరమైన విషయం. 


ఇలా సాగర తీరంలో సరికొత్త రాజకీయ తుపాన్ అన్నంతగా హడావుడి చేసి అంతలోనే చప్పున చల్లారి తీరం దాటేసిన చినబాబు టీడీపీ శ్రేణులకు ఛివరకు ఏమి సందేశం ఇచ్చారు. కంచుకోట లాంటి భీమిలీలో కూడా తాను నిలిచి గెలవలేననా, లేక కాస్మోపాలిటన్ సిటీ విశాఖలో సైతం తన హవా సాగదనా, ఒక వైపు మళ్ళీ ఏపీలో టీడీపీదే మళ్ళీ అధికారం అంటూ జబ్బలు చరచుకుంటూ అనుకూల మీడియా రాస్తున్న రాతలు అలాగే ఉన్నాయి.
Image result for lokesh contesting finally from mangalagiri
ఇక లోకేష్ తో ఉత్తరాంధ్రకు మహర్దశ వచ్చేసినట్లేనంటూ వండి వార్చిన కధనాలు ఉండనే ఉన్నాయి. ఇంతలోనే తట్టా బుట్టా చినబాబు సర్దేయడం వెనక మతలబు ఏంటో మరి. కంచు కోటల్లాంటి జిల్లాలోనే తమకు చుక్కెదురు అవుతుందనే లోకేష్ ఇలా గోటూ పెవిలియన్ అన్నాడని చెప్పుకుంటారా. వెనకబడిన జిల్లాల ఉద్ధరణ అంటూ రాసిన అనుకూల మీడియా ఇపుడేమంటుందో మరి!  నిజానికి విశాఖ ఉత్తరం, భీమిలీ రెండుచోట్ల పార్టీ చేసిన సర్వేల్లో లోకేష్ కి ఏం బాలేదన్న రిజల్ట్ వచ్చిందన్న కారణంగానే ఇక్కడ పోటీకి ఫుల్ స్టాప్ పెట్టేసి వెనక్కు వెళ్ళారని విపక్షం అపుడే కోడై కూస్తోంది.


మరి తన గెలుపుతో మంచి ఊపు తెచ్చేసి టోటల్ సీట్లన్నీ టీడీపీ ఖాతాలో వేస్తానంటున్న లోకేష్ ఇపుడు పోటీ చేయకుండా వెనక్కి తగ్గడం ద్వారా ఆ పార్టీ బేల తనాన్ని లోకానికి చెప్పకుండా చెప్పేశారా! విలువైన పుణ్య కాలమంతా ఇలా సీట్ల సర్ధుబాట్లతో ఖర్చు రాసేసిన భావి నాయకుడు ఇపుడు టీడీపీ తమ్ముళ్ల ఆత్మస్థైర్యాన్ని పూర్తిగా తగ్గించేసి డీలాపడేలా చేశారా! అంటే అవుననే సమాధానం వస్తొంది. మొత్తానికి గత కొన్ని రోజులుగా లోకెష్ విశాఖ పోటీ పేరు మీద సాగిన ఎపిసోడ్ మొత్తం టీడీపీ పరువు పోయేలా చేసిందని తమ్ముళు వగచి వాపోతున్నారు.


విశాఖలో పదిహేనుకు పదిహేను సీట్లు గెలుస్తామని చెప్పుకుంటున్న తమ్ముళ్లకు లోకేష్ పలాయనం మింగుడు పడడంలేదు. చినబాబుకే ఓటమి భయం పట్టుకుందంటూ ప్రతిపక్షం వేస్తున్నసెటైర్లకు ఎన్నికల ముందే ఓడినంత పనవుతోందని తమ్ముళ్ళు ఆవేదన చెందుతున్నారంటే అందులో ఎంతో అర్ధముందిగా!
Image result for lokesh contesting finally from mangalagiri
మళ్ళీ కొత్తగా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తాడని టీడీపీ అధిష్టానం కన్ ఫర్మ్ చేసేసింది. మొదటగా విశాఖ - భీమిలి అని రకరకాల పేర్లు వచ్చినా ఫైనల్ గా మంగళగిరి నే సెలెక్ట్ చేశారు చంద్రబాబు. సీఆర్డీఏ పరిధిలో ఎక్కువ గ్రామాలు మంగళగిరి లోనే రావడం, అక్కడ టీడీపీ చేసిన అభివృద్ధిని చూసి లోకేష్ కు అందరూ ఏక మొత్తంగా ఓట్లు వేస్తారని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. అయితే ఇక్కడే అసలు లాజిక్ ఉంది.


టీడీపీకి అసలు మంగళగిరి అనేది అంత సేఫ్ కాదు. ఎందుకంటే అక్కడ బీసీ ఓటర్లు ఎక్కువ. బీసీ ఓటర్లంతా మొదటి నుంచి కమ్యూనిస్టుల వైపు ఉన్నారు. కాంగ్రెస్ కానీ - టీడీపీ కానీ గతంలో మంగళగిరి సీటు గెలిచాయంటే అదంతా కమ్యూనిస్టులతో పొత్తుల వల్లే.  కానీ ఇప్పుడు కమ్యూనిస్టులతో పొత్తు జనసేనతో ఉంది. ఇప్పుడు జనసేన తరపున ఎవరైనా మంగళగిరిలో నామినేషన్ వేస్తే వాళ్లు కచ్చితంగా ఓట్లు చీలుస్తారు. ఈ మేరకు జనసేకు - టీడీపీ ఒప్పందం జరిగింది అనేది కూడా బయట విన్పిస్తున్న మాట. టీడీపీ ఓట్లు ఏటూ టీడీపీకే పడతాయి. 
Image result for lokesh contesting finally from mangalagiri
అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఓటింగ్ శాతం పడిపోతుంది. లోకేష్ అటోమేటిగ్గా గెలుస్తాడు. ఇదీ టీడీపీ లెక్క. అన్నింటికి మించి టీడీపీ ప్రభుత్వా నికి పక్కలో బల్లెంలా తయారైన ఆర్కేకు కూడా ఫుల్ స్టాప్ పెట్టినట్లు అవుతుంది. అంటే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నమాట. మరోవైపు లోకేష్ కు ప్రత్యక్ష రాజకీయాల్లో రాణించలేడు అనే విమర్శలకు కూడా ఫుల్-స్టాప్ పెట్టినట్లు అవుతుంది. అందుకే చంద్రబాబు తెలివిగా లోకేష్ మంగళగిరి నుంచి బరిలోకి దింపారని విశ్లేషకులు అంచనా. 


మరింత సమాచారం తెలుసుకోండి: