తెలుగుదేశం పార్టీ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. గురువారం రోజంతా కసరత్తు చేసిన చంద్రబాబు అర్థరాత్రి జాబితా విడుదల చేశారు. తొలిజాబితాలో 126 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. మరో 49 స్థానాలు పెండింగ్‌లో పెట్టారు. 



గుంటూరు జిల్లాలో మొత్తం 17 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. 3 స్థానాలను వాయిదా వేశారు. 
జిల్లాలో 9 స్థానాలను ఓసీ అభ్యర్థులకు ప్రకటించారు. మూడు స్థానాలు ఎస్సీలకు కేటాయించారు. బీసీలకు ఒక్క రేపల్లె మాత్రమే ఇచ్చారు. ఒక స్థానం మైనారిటీలకు ఇఛ్చారు. 


గుంటూరు జిల్లా టీడీపీ తొలి జాబితా ఇదిగో..

1. పొన్నూరు- ధూళిపాళ్ల నరేంద్ర
2. పెదకూరపాడు- కొమ్మాలపాటి శ్రీధర్
3. తాడికొండ-   శ్రీరామ్ మాల్యాద్రి
4. మంగళగిరి- నారా లోకేశ్
5. వేమూరు- నక్కా ఆనందబాబు


6. రేపల్లె- అనగాని సత్యప్రసాద్ 
7. తెనాలి-ఆలపాటి రాజేంద్రప్రసాద్ 
8. ప్రత్తిపాడు- డొక్కా మాణిక్య వరప్రసాద్ 
9. గుంటూరు పశ్చిమ-మద్దాలి గిరిధర్
10. గుంటూరు తూర్పు-మహ్మద్ నజీర్

11. చిలకలూరిపేట- ప్రత్తిపాటి పుల్లారావు
12. సత్తెనపల్లి- కోడెల శివప్రసాదరావు
13. వినుకొండ- జీవీఎస్ ఆంజనేయులు
14. గురజాల- యరపతినేని శ్రీనివాసరావు

పెండింగ్ స్థానాలు: 
15. బాపట్ల 
16. మాచర్ల 
17. నరసరావుపేట



మరింత సమాచారం తెలుసుకోండి: