ఎన్నికలు వస్తున్నాయంటే చాలు ఆ పార్టీ నుండి ఈ పార్టీకి.., ఈ పార్టీ నుండి ఆ పార్టీకి వలసలు వెళ్లేవారు ఎక్కువ. కొందరు పార్టీ టిక్కెట్ల కోసం ఉన్న పార్టీని వదిలేస్తే.. మరి కొందరు తమ పార్టీ అధికారంలోకి రాదేమోనన్న భయంతో పార్టీ ఫిరాయిస్తారు. కేవలం ఇవే కాదు.., ఇంకా అనేక కారణాలు ఉండొచ్చు.అయితే తాజాగా వస్తున్న సమాచారం మేరకు పర్చూరు నియోజకవర్గంలోని వైకాపా నేతలు భారీగా టీడీపీలోకి వలస వెళ్లనున్నారని తెలుస్తోంది. ఈ వలసల వెనుక ఉన్న అసలైన కారణం అభ్యర్థి విషయంలో డైలామా..


ఎన్నికల సమరానికి ఇంకా 25రోజులే మిగిలి ఉన్నాయి. కానీ ఇంత వరకూ నియోజకవర్గ అభ్యర్థి పేరు ఖరారు కాలేదు. తొలుతగా దగ్గుబాటి హితేష్ చెంచు రామయ్యకి టికెట్ కేటాయించాలనుకున్నా అతని అమెరికా పౌరసత్వం అడ్డంకిగా మారుతుందనే భావంతో పార్టీ అధినేత జగన్ అతనికి టికెట్ ఇవ్వదలుచుకోలేదు. ఇక దగ్గుబాటి వెంకటేశ్వర రావునే రేసులో నిలపాలని అనుకున్నా అతనిపై జనాల్లో వ్యతిరేకత ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఇక ఈ విషయంలోనే జగన్ మరొక్కసారి ఆలోచనలో పడ్డారట. రాంబాబుకి టికెట్ ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా చేస్తున్నట్టు సమచారం. ఇలా అభ్యర్థి విషయంలో క్షణానికో మాట వినిపిస్తున్న నేపథ్యంలో పార్టీ కార్యకర్తల్లో అసమ్మతి మొదలైంది.


ప్రస్తుత ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు నియోజకవర్గ అభివృద్ధిలో గానీ, ప్రజల సమస్యలు తీర్చడంలో గానీ ముందున్న నేపథ్యంలో మళ్ళీ ఆయనకే ప్రజలు పట్టం కట్టనున్నారని టాక్ గట్టిగా వినిపిస్తోంది. గెలుపు పక్షాన ఉంటే భవిష్యత్తులో ప్రయోజనం పొందొనచ్చని వైకాపా కార్యకర్తలు భావిస్తున్నారట. ఇక మన పార్టీ గెలవనట్టే అని వారిలో వారే చర్చించుకుని టీడీపీలోకి చేరేందుకు సిద్ధమయ్యారు.ఇంకొల్లు టౌన్ వైడ్ పార్టీ ప్రెసిడెంట్ లతీఫ్ తో సహా.. పర్చూరు మండలానికి చెందిన అనేకమంది వైకాపా కార్యకర్తలు టీడీపీ తీర్ధం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇక రానున్న రోజుల్లో మరి కొందరు నేతలు టీడీపీ తీర్ధం పుచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: