ప్రియాంకా గాంధీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆశాకిరణం.. ప్రత్యేకించి యూపీలో కాంగ్రెస్ పార్టీ ప్రియాంకపైనే ఆశలు పెట్టుకుంది. నాయనమ్మ ఇందిరను తలపింపజేసే ఆమె తన తొలి ప్రసంగంతో తనను తక్కువ అంచనా వేయాల్సిన పనిలేదని చెప్పకనే చెప్పింది. 

సంబంధిత చిత్రం

ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీల కూటమి ప్రకటన కాంగ్రెస్‌కు కష్టాలు సృష్టించింది. యూపీలోని ఈ పార్టీలు దేశంలో అత్యంత పురాతన పార్టీని విస్మరించాయి. ఈ పరిస్థితుల్లో బీజేపీయే కాకుండా ఈ పాత మిత్రులు కూడా కాంగ్రెస్ ప్రత్యర్థులుగా మారారు.

priyanka gandhi with public కోసం చిత్ర ఫలితం
ఎస్‌పీ, బీఎస్‌పీల నుంచి ఈ పాఠం నేర్చుకున్న కాంగ్రెస్ యూపీలోని 80 లోక్‌సభ స్థానాలకూ తమ అభ్యర్థులను నిలుపుతామని తొలుత ప్రకటించింది. చావో రేవో అన్న దిశగా పోరాటం ప్రారంభించింది. ప్రియాంకా గాంధీ రాకతో కాంగ్రెస్ కార్యకర్తల్లో నూతనోత్సాహం వచ్చింది. 

priyanka gandhi with public కోసం చిత్ర ఫలితం

ఇప్పుడు మీడియా కూడా ప్రియాంకాకు ప్రత్యేకమైన కవరేజ్ ఇస్తోంది. ప్రత్యేకించి ప్రియాంక గాంధీ పార్టీ ఇన్‌చార్జిగా ఉన్న తూర్పు ఉత్తరప్రదేశ్‌లో నరేంద్రమోదీ, యోగి ఆదిత్యనాథ్‌లతో ఆమె నేరుగా తలపడుతున్నారు. మరి ప్రియాంకా వీరిద్దరితో పాటు తమను తేలిగ్గా తీసుకున్న ఎస్‌పీ-బీఎస్‌పీ కూటమికి కూడా షాక్ ఇస్తారా అన్నది కాలమే తేల్చాల్సి ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: