ఎవడు పడిటే వాడు రావడానికి, ఎప్పుడుపడితే అప్పుడు పోవటానికి ఇదేమన్నా పశువుల దొడ్డా! ఇది భాగమతి అడ్డా! అన్న భాగమతి చిత్రంలో పవర్ ఫుల్ డయలాగ్ ఆ సినిమాను నడిపించి విజయవంతం చేసింది. ప్రత్యర్థిని అదను చూసి దెబ్బతీయటం రాజకీయాల్లో అతి సహజం. జనం మనవైపే ఆకర్షితులు అవుతున్నారని ఆ మాయ లో దూరం ఆలోచించ కుండా, తర్కం వదిలేస్తే అది అత్యంత ఖరీదైన తప్పిదం అవుతుంది. దాని ప్రభావం జీవితానికి సరిపడా దెబ్బ కొడుతుంది. 


దశాబ్ధాలపాటు ఒక పార్టీని అనేక కారణాలతో అంటి పెట్టుకొని అదే జీవితం అనుకున్న వ్యక్తి ఆ పార్టీ వదిలేసి, వేరే పార్టీలోకి అవసరార్ధం అవకాశార్ధం దూకే జంపింగ్ జపాంగుల  విషయంలో కేసీఆర్ వ్యవహారశైలి అద్భుతంగా ఉంటుంది. "వస్తానన్న వారందరిని వచ్చేయమని చెబుతారా?" అంటే కొందరికి 'నో' అనే చెప్పాలి. పార్టీలోకి వస్తామని కోరినవారి కంటే తాము గుర్తించి ఎంపిక జేసుకొన్న ఆణి ముత్యాలనే తీసుకుంటే మనకు, మనపార్టీకి మేలు జరుగుతుందని భావించిన వారికే అధిక ప్రాధాన్యత ఉంటుందన్న మాట మరోసారి కేసీఆర్ విషయంలో ఋజువైంది.
Image result for great strategist KCR not KTR
తాజాగా ఖమ్మం జిల్లాకు చెందిన ఒక పరిపూర్ణ సంపూర్ణ తెలుగు తమ్ముడు - టిడిపి రక్తం నరనరాన దశాబ్ధాల తరబడి జీర్ణించుకున్న ఒకరు టీఆర్ఎస్ లోకి చేరిపోవ టానికి సిద్ధమయ్యారు. ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా మెలిగినవారే! ఈ రాజకీయవేత్తగా మారిన పారిశ్రామికవేత్త గులాబీ గూటికి చేరి కారులో ఎక్కేందుకు తన ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. 


తాజాగా జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో "లోక్-సభ బరి" లో నిలిచేందుకు వీలుగా తన పావులు కదుపుతున్నారు. అది తెలుగుదేశం పార్టీలో ఉండి గెలవటం ఇప్పుటి పరిస్థితుల్లో సాధ్యం కాదు కాబట్టి-తన ప్రణాళికలో భాగంగా తెలంగాణాలో బాగా ప్రసిద్ధంలో ఉన్న టీఆర్ఎస్ లో చేరి ఎన్నికల్లో గెలవటానికి టిఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తో రహస్య మంతనాలు జరిపారని సమాచారం. 


తాను తెలంగాణా రాష్ట్రసమితిలో చేరాలని అనుకుంటున్నట్లు చెప్పటమే కాదు, తనకు ఆ అవకాశం ఇస్తే ఖమ్మం లోక్-సభ స్థానానికి టిఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్ధి గా పోటీ చేస్తానని, అందుకు అయ్యే ఖర్చులు మొత్తం స్వయంగా తానే చూసుకుంటానని చెప్పినట్లుగా తెలిసింది. ఆ మహనీయనేత మాటలు విన్న కేటీఆర్ వెంటనే "యురేఖా అంటూ ఎగిరిగంతేసి" తన తండ్రి టీఅర్ఎస్ సార్వబౌముడు కేసీఆర్ కు ఫోన్ చేసినట్లు సమాచారం. 
Image result for great strategist KCR not KTR
ఆ తెలుగు తమ్ముడ్ని పార్టీలో చేర్చుకునేందుకు కేటీఆర్ అమేయానందంతో అంగీకారం తెలపటానికి సిద్ధమయ్యారు. అందుకు విభిన్నంగా కేసీఆర్ మాత్రం "నో" చెప్పి కేసీఆర్ లో పొంగుతున్న ఆనంద పాలపొంగుపై నీళ్ళు చల్లిన తీరు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా చర్చనీయాంశం అయింది. 


ఆ నేత ఆనుపానులు గురించి తనకు తెలుసని, ఆయన్ను టిఆర్ఎస్ పార్టీలో కుదురుకొనే ఏర్పాటు చేయలేమని, ఆయన్ను పార్టీలోకి తీసుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని చెప్పటమే కాదు, ఆయనకు ఎలాంటి హామీ ఇవ్వకుండా అంటే నొప్పించక తానొవ్వక తప్పించుకోమని కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు.
Image result for great strategist KCR not KTR
"తండ్రి మాటతో అవాక్కు అయిన కేటీఆర్" మరోమాట మాట్లాడకుండా — అవకాశాన్ని అవసరాన్ని వెతుక్కొంటూ వచ్చిన ఖమ్మం టిడిపి మహనీయుణ్ణి వెనక్కు పంపినట్లుగా తెలుస్తోంది. అప్పుడు "కేసీఆరా! మజాకానా!" అని అనుకొని ఉంటాడు ఇక్కడ కేటీఆర్ అక్కడ ఎన్ఎన్ఆర్ !


మనోఫలకంపై ఏమి మెదిలిందో కేటీఆర్ కు తెలియకపోయినా ఎన్ఎన్ఆర్(?) కు తెలిసి ఉంటుందన్నది నూరుపాళ్లు నిజం అదేమంటే రాజకీయాల్లోనూ,  కేసీఆర్ దృష్టిలోనూ అభ్యర్ది గుణం ప్రధానం కాదు! కులం ప్రధానం!" అని. 

మరింత సమాచారం తెలుసుకోండి: