ఇండో పాక్ సరిహద్ధులు సెగలు గ్రక్కుతున్నాయి. సరిహద్దుల్లో నివసించే ప్రజలు సమీప దూరంలోనే యుద్ధం జరిగే సూచనలను గమనిస్తున్నాయి. అయితే గత ఎయిర్ స్ట్రైక్స్ తరవాత ఒక దశలో భారత్, పాక్‌లు ఒకరిపై ఒకరు క్షిపణులతో దాడిచేసుకోడానికి కూడా సిద్ధపడినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. 
Image result for pak threatens india that will use three times missiles on India
పుల్వామా ఆత్మాహుతి దాడికి ప్రతీకారంగా పాక్ భూభాగం లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ వైమానిక దాడులు జరపడం తో ఇండో పాక్ దేశాల మధ్య యుద్ద వాతావరణం అలుముకుంది. అయితే, అమెరికా భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ సహా అధికారులు జోక్యంతో భారత్, పాక్‌లు ఒకరిపై ఒకరు క్షిపణులతో దాడిచేసుకోకోవడానికి సిద్ధ పడిన సందర్భం నివారించబడింది. పరిస్థితి అదుపులోకి వచ్చిందని పలు వర్గాలు పేర్కొన్నాయి.
John R. Bolton official photo.jpg
పాకిస్థాన్‌ పై తాము కనీసం ఆరు క్షిపణులు ప్రయోగిస్తామని భారత్ హెచ్చరిస్తే, పాక్ కూడా అంతే స్థాయిలో తామేమీ తక్కువ కాదని, దీనికి మూడు రెట్లు క్షిపణులతో దాడిచేస్తామని బెదిరించినట్టు పశ్చిమ దేశాల రాయబారులు, కేంద్ర వర్గాలు తెలిపాయి. ఈ సమయంలో అణ్వాయుధ దేశాల మధ్య ఉద్రిక్తతలు హఠాత్తుగా మారిపోయి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయని, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాల్లో ఒకటిగా కశ్మీర్ నిలిచిందన్నారు. 
అయితే ఇవి కేవలం బెదిరింపులకు మాత్రమే పరిమితమయ్యాయని, క్షిపణులు, సంప్రదాయ ఆయుధాల ప్రయోగించే సూచన కూడా కనిపించకపోయినా, అమెరికా, చైనా, బ్రిటన్ దేశాధినేతల గుండెల్లో మాత్రం భూకంపం సృష్టించారన్నది మాత్రం నిజం. 
Related image
దక్షిణాసియాలో 2008 నుంచి జరిగిన భయంకర ఉగ్రదాడుల గురించి కథనాలు ప్రచురించిన రాయిటర్స్, భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి దౌత్యపరంగా దృష్టి సారించింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ బాలకోట్ ప్రాంతంలో ఉగ్రవాద శిబిరాలపై ఎయిర్ స్ట్రయిక్స్ అనంతరం ఫిబ్రవరి 27 నుంచి కశ్మీర్‌ సరిహద్దుల్లో భారత్-పాక్‌ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయని వ్యాఖ్యానించారు. 1971 భారత్-పాక్ యుద్ధం తర్వాత ఇండియాకు చెందిన వాయు సేన పైలట్‌ అభినందన్ ను పాక్ ఆక్రమిత కశ్మీర్‌ లో పట్టుబడటం, తర్వాత పరిణామాలతో అతడిని విడిచిపెట్టిన విషయం తెలిసిందే. 
Image result for ajit doval & asim muneer

Image result for ajit doval & asim muneer

అయితే, అభినందన్ పట్టుబడిన రోజు సాయంత్రం పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ చీఫ్ అసిమ్ మునీర్‌ తో ఇండియా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాట్లాడుతూ ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలియజేశాయి. అంతే కాదు, పాక్ భూభాగంలో స్వేచ్ఛగా తిరుగు తోన్న ఉగ్రవాద సమూహాల తోనే తమ పోరాటమని కుండ బద్దలు కొట్టారు. 
Image result for pak threatens india that will use three times missiles on India
ఆరు క్షిపణులతో భారత్ తమ పై దాడి చేస్తుందన్న అంశాన్ని పాక్ మంత్రి, పశ్చిమ దేశానికి చెందిన రాయబారి ధ్రువీకరించారు. అయితే, ఈ హెచ్చరికలు ఎవరు చేశారనే అంశాన్ని మాత్రం పాక్ మంత్రి స్పష్టం చేయలేదు. కానీ, భారత్ తమపై ఒక వేళ క్షిపణి దాడులు చేస్తే అంతకు మూడు రెట్లు అధికంగా క్షిపణులు వేస్తామని అన్నట్టు తెలిసింది. మీరు ఒకటి ప్రయోగిస్తే మేము మూడు వేయగలం అంటూ తిరిగి బెదిరించినట్టు రాయబారి వెల్లడించారు.
పుల్వామా ఆత్మాహుతి దాడికి ప్రతీకారంగా పాక్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ వైమానిక దాడులు జరపడంతో ఇరు దేశాల మధ్య యుద్దవాతావరణం నెలకున్న విషయం తెలిసిందే. అయితే, ఒక దశలో భారత్, పాక్‌లు ఒకరిపై ఒకరు క్షిపణులతో దాడిచేసుకోడానికి కూడా సిద్ధపడినట్టు విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. అమెరికా భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ సహా అధికారులు జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందని పలు వర్గాలు పేర్కొన్నాయి. పాకిస్థాన్‌పై తాము కనీసం ఆరు క్షిపణులు ప్రయోగిస్తామని భారత్ హెచ్చరిస్తే, పాక్ కూడా అంతేస్థాయిలో స్పందించింది. తామేమీ తక్కువ కాదని, దీనికి మూడు రెట్లు అధికంగా క్షిపణులతో దాడిచేస్తామని బెదిరించినట్టు పశ్చిమ దేశాల రాయబారులు, కేంద్ర వర్గాలు తెలిపాయి. ఈ సమయంలో అణ్వాయుధ దేశాల మధ్య ఉద్రిక్తతలు హఠాత్తుగా మారిపోయి యుద్ధమేఘాలు కమ్ముకున్నాయని, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాల్లో ఒకటిగా కశ్మీర్ నిలిచిందన్నారు. 

కానీ, ఇవి కేవలం బెదిరింపులు మాత్రమే పరిమితమయ్యాయని, క్షిపణులు, సంప్రదాయ ఆయుధాల ప్రయోగించే సూచన కనిపించకపోయినా, అమెరికా, చైనా, బ్రిటన్ దేశాధినేతల్లో మాత్రం గందరగోళం సృష్టించారన్నారు. దక్షిణాసియాలో 2008 నుంచి జరిగిన భయంకర ఉగ్రదాడుల గురించి కథనాలు ప్రచురించిన రాయిటర్స్, భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి దౌత్యపరంగా దృష్టి సారించింది. ఉగ్రవాద శిబిరాలపై ఎయిర్ స్ట్రయిక్స్ అనంతరం ఫిబ్రవరి 27 నుంచి కశ్మీర్‌ సరిహద్దుల్లో భారత్, పాక్‌ల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయని వ్యాఖ్యానించారు. 1971 భారత్-పాక్ యుద్ధం తర్వాత ఇండియాకు చెందిన వాయిసేన పైలట్‌ను పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో పట్టుబడటం, తర్వాత పరిణామాలతో అతడిని విడిచిపెట్టిన విషయం తెలిసిందే. 

అయితే, అభినందన్ పట్టుబడిన రోజు సాయంత్రం పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ చీఫ్ అసిమ్ మునీర్‌తో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాట్లాడుతూ ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో వెనక్కు తగ్గేదిలేదని స్పష్టం చేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలియజేశాయి. అంతేకాదు, పాక్ భూభాగంలో స్వేచ్ఛగా తిరుగుతోన్న ఉగ్రవాద సమూహాలతోనే తమ పోరాటమని కుండబద్దలుకొట్టారు. 

ఆరు క్షిపణులతో భారత్ తమపై దాడి చేస్తుందన్న అంశాన్ని పాక్ మంత్రి, పశ్చిమ దేశానికి చెందిన రాయబారి ధ్రువీకరించారు. అయితే, ఈ హెచ్చరికలు ఎవరు చేశారనే అంశాన్ని మాత్రం స్పష్టం చేయలేదు. కానీ, భారత్ తమపై ఒకవేళ క్షిపణి దాడులు చేస్తే అంతకు మూడు రెట్లు అధికంగా క్షిపణులు వేస్తామని అన్నట్టు తెలిసింది. మీరు ఒకటి ప్రయోగిస్తే మేము మూడు వేయగలం అంటూ తిరిగి బెదిరించినట్టు రాయబారి వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: