ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు జగన్ హవా నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకే విజయవాకాశాలు ఉన్నాయని దాదాపు అన్ని సర్వేలు చెబుతున్నాయి. దాదాపు ఏ సర్వే కూడా తెలుగుదేశం గెలుస్తుందని చెప్పడంం లేదు. ఐతే.. తాజాగా వచ్చిన టైమ్స్ నౌ - వీఎంఆర్ సర్వేలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. 



జగన్ హవా నడుస్తుందని అనుకున్నాం.. కానీ అది మాములుగా లేదట. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో వైసీపీ 22 ఎంపీ సీట్లు సాధిస్తుందని సర్వేలో తేలింది. టీడీపీకి కేవలం మూడు సీట్లు మాత్రమే వస్తాయని అభిప్రాయసేకరణలో వెల్లడైనట్టు తెలిపింది. 



ఇక...  ఓట్ షేర్ పరంగా చూస్తే, వైసీపీకి 48.8 శాతం, టీడీపీకి 38.40 శాతం ఓట్లు రావొచ్చని టైమ్స్ నౌ-వీఎంఆర్ సర్వే  అంచనా వేసింది. బీజేపీకి 5.80 శాతం, కాంగ్రెస్‌కు 2.20 శాతం ఓట్లు రావొచ్చని తెలిపింది.  మార్చిలోనే  నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో మొత్తం 16,931 మంది పాల్గొన్నారు. 



జనవరి తర్వాత సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఫించను డబుల్ చేసేశారు. డ్వాక్రా సంఘాలకు పదివేల రూపాయలు కానుక ఇచ్చారు. ఇవన్నీ సీన్ మార్చేస్తాయని టీడీపీకి విజయం ఇస్తాయని ఆ పార్టీ భావిస్తోంది. కానీ.. అవేమీ పరిస్థితి మార్చలేవని ఈ సర్వే చెబుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: