రోజుల తరబడి చర్చలు జరిపి అసెంబ్లీ, ఎంపీ స్థానాలకు టికెట్ల జాబితా ప్రకటించినా చంద్రబాబుకు తలనొప్పులు తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా..ఎంతగా బుజ్జగించినా కొందరు ఎమ్మెల్యేలు మాత్రం తిరుగుబాటు జండా ఎగరేస్తున్నారు. దాదాపు నలుగురు సిటింగ్ ఎమ్మల్యేలు ఇండిపెండెంట్లుగా పోటీకి సిద్దమవుతున్నారు. 

సంబంధిత చిత్రం


నందమూరి బాలకృష్ణకు సన్నిహితుడుగా పేరొందిన కదిరి బాబూరావుకు కనిగిరి బదులు దర్శి టిక్కెట్ ఇచ్చారు. కనిగిరి ఉగ్రనరసింహారెడ్డికి ఇచ్చారు. దీంతో సంతృప్తి చెందని కదిరి బాబూరావు కనిగిరి నుంచే ఇండిపెండెంట్‌గా బరిలో దిగుతానంటున్నారు. 
kadiri babu rao కోసం చిత్ర ఫలితం


పశ్చిమ గోదావరి జిల్లాలో మాజీ మంత్రి  పీతల సుజాతకు చంద్రబాబు టికెట్ నిరాకరించారు. దీంతో ఆమె కూడా  చింతలపూడి నుంచి ఇండిపెండెంట్ గా  పోటీ చేస్తానంటోంది. ఇక కళ్యాణ దుర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి ఇప్పటికే ఇండిపెండెంట్ గా నామినేషన్ కూడా వేసేశారు.

meesala geetha కోసం చిత్ర ఫలితం

ఇక విజయనగరం నుంచి సిటింగ్ ఎమ్మెల్యే మీసాల గీత కూడా ఇండిపెండెంటుగా నామినేషన్ వేస్తామంటున్నారు. ఇక్కడ అశోక్ గజపతి రాజు కుమార్తె కోసం గీతకు చంద్రబాబు టికెట్ నిరాకరించారు. మరి ఈ అసంతృప్తులను చంద్రబాబు ఎలా డీల్ చేస్తారో..? 



మరింత సమాచారం తెలుసుకోండి: