కియా కార్ల సంస్థ.. చంద్రబాబు ఎన్నికల అస్త్రాల్లో ఇదీ ఒకటి. రాళ్లు తప్ప ఏమీ లేని రాయలసీమలో కియా ప్లాంట్ రప్పించానంటూ ఆయన ఘనంగా చెప్పుకుంటున్నారు. కియా సంస్థ వల్ల వేల ఉద్యోగాలు వచ్చాయని ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయలో అదే కియా సంస్థ చంద్రబాబుకు షాక్ ఇచ్చింది. 

kia plant kia cars కోసం చిత్ర ఫలితం


కార్లు ఆశించిన స్థాయిలో అమ్ముడుపోవట్లేదనే ఒకే ఒక్క కారణంతో చైనాలోని యాంగ్ చెన్ ప్లాంట్ ను కియా సంస్థ మూసివేసింది. ప్రపంచంలో అత్యధికంగా కార్లు అమ్ముడుపోయే దేశాల్లో అగ్రస్థానంలో ఉన్న చైనాలోనే ఆ సంస్థ పరిస్థితి అలా ఉంటే.. అనంతపురం ప్లాంట్ సంగతేంటి అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమౌతున్నాయి.
kia plant kia cars కోసం చిత్ర ఫలితం

చైనాలో ప్లాంట్ మూసివేత వల్ల ఇప్పటికిప్పుడు అనంతపురం కియా ప్లాంట్‌కు వచ్చిన నష్టం ఏమీ లేకపోయినా.. భవిష్యత్ పై ఆందోళన తప్పదు. ఇండియాలో కార్ల సంస్థల నుంచి పోటీ ఎదుర్కొని కియా సంస్థ కార్లు అమ్మగలిగితేనే అనంతపురం ప్లాంట్ మనగలుగుతుంది. మరి ఆ సత్తా కియా చూపగలుగుతుందా.?

సంబంధిత చిత్రం

అమ్మకాల్లో ఏ మాత్రం క్షీణత కనిపించినా.. ప్లాంట్ ను కొనసాగించే పరిస్థితి కనిపించడం లేదు. ఇందుకు యాంగ్ చెన్ ప్లాంట్ ను మూసివేయడమే ఓ ఉదాహరణ. మరి అనంతపురం ప్లాంట్ కూడా సుదీర్ఘ కాలం పాటు నడవాలంటే.. లక్ష్యానికి మించి కార్లు అమ్ముడుపోవాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: