చంద్రబాబునాయుడు.. 40 ఇయర్స్ ఇండస్ట్రీ.. తెలుగు నేతను ఇంతకాలం పాటు ఏలిన నేత మరొకరు లేరు. దాదాపు 9 ఏళ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను.. ఐదేళ్లపాటు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ను ఏలిన నాయకుడు. రాజకీయ చాణక్యుడిగా పేరున్న చంద్రబాబు తన రాజకీయ జీవితంలో 5 దిద్దుకోలేని తప్పులు చేశారు. 



1. కేసీఆర్‌కు మంత్రి పదవి ఇవ్వకపోవడం.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు మంత్రి పదవి ఇవ్వడానికి నిరాకరించారు. అంతకుముందే ఎన్టీఆర్ హయాంలోనే రవాణాశాఖ మంత్రిగా కేసీఆర్ పనిచేశారు. చంద్రబాబు పదవి ఇవ్వకపోవడంతో కేసీఆర్ తెలంగాణ ఉద్యమంవైపు అడుగులు వేశారు. చివరకు అది రాష్ట్రవిభజనకు దారి తీసింది. తెలంగాణలో తెలుగుదేశం భూస్థాపితానికి కారణమైంది.



2. తెలంగాణను అనుకూలంగా తెలుగుదేశం తీర్మానం చేయడం, లేఖ ఇవ్వడం.. ఏపీ విభజన ఏమాత్రం ఇష్టం లేని చంద్రబాబు.. తెలుగుదేశం పార్టీ రాజకీయ లబ్ది కోసం తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి లేఖ ఇచ్చారు. ఆ.. తెలంగాణ వచ్చేదీ లేదూ చచ్చేదీ లేదు.. మనమెందుకు రాజకీయంగా ఇబ్బందిపడాలని ఆలోచించారు తప్ప.. సుదూర భవిష్యత్తును అంచనావేయలేకపోయారు. 

3. నారా లోకేశ్‌ పై అతి ప్రేమ.. చంద్రబాబు స్వతహాగా తెలివైన నాయకుడు. ఆ తెలివితోనే రాజకీయాల్లో రాణించారు. కానీ లోకేశ్‌ కు అంత సీన్ లేదు. ఆ విషయం తెలిసి కూడా కొడుకును పార్టీపై బలవంతంగా రుద్దుతున్నారు చంద్రబాబు. దీని వల్ల పార్టీ భవిష్యత్తునే పణంగా పెడుతున్నారు.

note for  chandrababu కోసం చిత్ర ఫలితం

4. నోటుకు ఓటు కేసు.. చంద్రబాబు రాజకీయ జీవితంలోనే అతి పెద్ద మచ్చ ఇది. ఓ ఎమ్మెల్సీ సీటులో గెలుపు కోసం కక్కుర్తిపడి రేవంత్ రెడ్డి ద్వారా ఓట్ల కొనుగోలుకు సిద్దపడ్డారు చంద్రబాబు. అంతే కాక ఫోన్‌ లైన్‌లో మనవాళ్లు బ్రీఫ్డ్ మీ అంటూ దొరికిపోయారు. దీని కారణంగా కేసీఆర్ బెదిరింపులకు భయపడి ఉమ్మడి రాజధాని వదిలేసి అమరావతికి తరలిపోవాల్సి వచ్చింది. 

5. ప్రత్యేక హోదా.. బీజేపీతో రాజకీయ లబ్ది కోసం పొత్తు పెట్టుకుని.. ప్రత్యేక హోదా నినాదం గొంతు నొక్కేయడం చంద్రబాబు చేసిన మరో పెద్ద తప్పు. మళ్లీ ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలంటూ  ప్లేటు ఫిరాయించడంతో చంద్రబాబు తన విశ్వసనీయత కోల్పోయారు. ఇలా రాజకీయ చాణక్యుడిగా పేరున్నా.. ఆయన చేసిన తప్పులు ఆయన పార్టీని బలిగొనే ప్రమాదంలోకి నెట్టేశాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: