మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినపుడు ఆయన పెద్ద తమ్ముడు మెగా బ్రదర్ ఆ పార్టీ విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకోలేదు.  కానీ ఆయన చిన్న తమ్ముడు పవన్ కళ్యాన్ మాత్రం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భారీ స్థాయిలో ప్రచారం చేశారు.  గత సార్వత్రిక ఎన్నికల సమయంలో పవన్ కళ్యాన్ ‘జనసేన’పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే. 
Image result for nagababu pawan kalya
గతంలో నాగబాబు, పవన్ కళ్యాన్ మద్య మనస్పర్దలు వచ్చాయని..వార్తలు వచ్చాయి.  కానీ కొంత కాలంగా తమ్ముడు పవన్ కళ్యాన్ విషయంలో ఏ చిన్న సంఘటన జరిగినా మెగా బ్రదర్ నాగబాబు చాలా తీవ్ర స్థాయిలో రియాక్ట్ అవుతున్నాడు..తన తమ్ముడిని ఎంతో ఉత్తముడు అని అంటున్నాడు..ప్రజల కోసం తన సినీ జీవితాన్ని వదులుకొని పోరాడుతున్నాడని..అతని త్యాగం ఎంతో మందికి ఆదర్శం అని అంటున్నారు. 
Image result for nagababu pawan kalya
ఈ మద్య తన సొంత యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి అందులో ప్రత్యక్షంగా, పరోక్షంగా జనసేనకు పూర్తి మద్దతు ఇస్తున్నారు.  అయితే జనసేన పార్టీ తరుపు నుంచి నాగాబాబు పోటీ చేస్తారని కొంత కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.  తాజాగా జనసేనలోకి అధికారంగా నాగబాబు చేరుతున్నారు.  నర్సాపురం లోక్ సభ స్థానం నుంచి నాగ బాబు పోటీ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఇటీవల గుంటూరు సభలో కార్యకర్తల సమావేశంలో నాగబాబు హాజరైన విషయం తెలిసిందే.  కొంత కాలంగా పార్టీకి సంబంధించిన మీటింగ్స్ లో పాల్గొంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: