ఒక నూటముప్పైయేళ్ళ వయసున్న ఒక పార్టీ. ఒకే కుటుంబానికి బానిసత్వం చేస్తూ బ్రత్కీడ్చే నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీ స్వంతం. దేశాన్ని నిట్టనిలువుగా చీల్చిన పాపం ఆ స్వాతంత్ర సంగ్రామం చేసిన ఆ పార్టీ స్వంతం. అలాంటి పార్టీ ఇప్పుడు పూర్తిగా అసమర్ధుల చేతిలో పడిపోయింది. ఇలాంటి వాళ్ళనే కీ.శే. ఎన్టిఆర్ "కుక్కమూతి పిందెలు" అని అనేవారు. అలాంటి కుక్కమూతి పిందెలకు బాకా ఊదేవాళ్ళు నేడు భారత్ పై ఉగ్ర్రదాడి చేసిన ఉగ్రవాదుల ఉత్పత్తికేంద్రం అయిన ఆదేశం పై దాడి చేయటం తప్పంటున్నారు.  
 
 
పాకిస్థాన్‌ లోని బాలాకోట్‌ పై భారత వాయుసేన జరిపిన దాడులను తప్పు పడుతూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శామ్‌ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా మండి పడ్డారు. భారత బలగాలను కించపరిచేలా మాట్లాడటం సిగ్గుచేటన్నారు ప్రధాని మోదీ. శామ్‌ పిట్రోడా వ్యాఖ్యలపై స్పందించిన నరేంద్ర మోదీ కాంగ్రెస్‌ను విమర్శిస్తూ వరుస ట్వీట్లు చేశారు.
modi vs pitroda కోసం చిత్ర ఫలితం
"ఉగ్రదాడికి దీటుగా బదులివ్వడం కాంగ్రెస్‌ కు ఇష్టం లేదు. ఇప్పుడు ఆ విషయాన్ని కాంగ్రెస్‌ రాజకుటుంబానికి అత్యంత విశ్వసనీయమైన వ్యక్తి కూడా ఒప్పుకున్నారు. ఉగ్రవాదుల పక్షాన మాట్లాడటం, మన సాయుధ బలగాలను ప్రశ్నించడం విపక్షాలకు అలవాటుగా మారింది. దేశ రక్షణ కోసం ప్రాణ త్యాగం చేస్తున్న జవాన్లను ప్రతిపక్ష నేతలు పదే పదే అవమానిస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిని ఈ దేశ ప్రజలు క్షమించరు" అని హెచ్చరించారు.
modi vs pitroda కోసం చిత్ర ఫలితం
అంతేకాక "ఈ దేశ ప్రజలను నేను కోరేది ఒక్కటే, ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ప్రతిపక్ష నేతలను ప్రశ్నించండి. ఇలాంటి అవమానకర వ్యాఖ్యలను క్షమించబోమని వారికి అర్థమయ్యేలా వారి భాషలోనే చెప్పండి. జవాన్లకు ఈ దేశం మద్దతుగా నిలుస్తుంది" అని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.  పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రతిపక్షాలు ఈ దాడులను ఎన్నికల జిమ్ముక్కుగా విమర్శిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు శామ్‌ పిట్రోడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రదాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్‌ పై దాడులు చేయడం మంచి పద్దతి కాదన్నారు.


పుల్వామా ఉగ్రదాడి పై స్పందిస్తూ "ఈ దాడుల గురించి నాకు పూర్తిగా తెలీదు. కానీ ఇలాంటి దాడులు గతంలో జరిగాయి. ముంబైలో కూడా చోటు చేసుకున్నాయి. ఇలాంటి దాడులు జరిగిన వెంటనే ప్రతీకారంగా మనం మన విమానలను పాకిస్తాన్ పై దాడులకు పంపడం చేస్తాం. కానీ కొందరు ఉగ్రవాదులు చేసిన పనికి మొత్తం పాకిస్తాన్‌ పై దాడి చేయడం మంచి పద్దతి కాదు. ఇలాంటి దాడులు చేసేవారు ప్రపంచంతో ఎలా వ్యవహరిస్తారో నాకు అర్థం కావడం లేదు" అని తెలిపారు. ఈ సందర్భం గా ముంబై దాడులను గుర్తు చేసుకుంటూ, ‘ఒక ఎనిమిది మంది వచ్చి మనదేశంలో దాడులు చేసి వెళ్లారు. ఈ చర్యలకు ఆ దేశాన్ని మొత్తం నిందించడం సరికాదు. ప్రతీకార దాడులను నేను నమ్మను" అని శామ్‌ పిట్రోడా స్పష్టం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: