ఇప్పుడు ఏపీలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం చూస్తుంటే.. ప్రజలకు ఓ సందేహం తలెత్తుతోంది.. చంద్రబాబు అధికారంలో ఉన్నది ఐదేళ్లా.. లేక గత మూడు నెలల నుంచేనా అన్నది ఆయన అనుమానం. అందుకు కారణాలు లేకపోలేదు.. 

సంబంధిత చిత్రం


ఎందుకంటే.. చంద్రబాబు ఇప్పుడు కేవలం గత మూడునెలలుగా ఎన్నికల్లో ఓట్లే లక్ష్యంగా ప్రవేశపెట్టిన పథకాల గురించే మాట్లాడుతున్నారు. ఆడబిడ్డలకు పసుపు కుంకుమగా పదివేలు ఇచ్చిన సంగతి చెబుతున్నాడు. వృద్ధులకు ఫించన్ రెట్టింపు చేసిన విషయం ఘనంగా ప్రచారం చేస్తున్నాడు. 

ap pensions కోసం చిత్ర ఫలితం
అన్నదాతా సుఖీభవ అంటూ ఏడాదికి పదివేల వరకూ ఇచ్చే పథకం గురించి కూడా బాగా బాకా కొడుతున్నారు. మరి ఈ పథకాలన్నీ గత ఐదేళ్ల నుంచి ఎందుకు పెట్టలేదు.. మరి గత నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు చేసిందేమిటి.. ఈ ప్రశ్నలన్నీ ఆయన బహిరంగ సభలకు హాజరవుతున్న ప్రజలకు వస్తున్నాయి. 



ఈ స్వల్పకాలిక అమలుతోనే ఇది తాత్కాలికమని.. ఎన్నికల స్టంట్ అన్న సంగతి పెద్దగా చదువురాని ఓటరు కూడా పసిగట్టేస్తున్నాడు. వీటితో పాటు.. జగన్ అధికారంలోకి వస్తే ఇస్తానన్న మూడు వేల రూపాయలు కూడా వృద్దలు కళ్లముందు కదులుతున్నాయి. అంటే తాజా ప్రచారంతో గత నాలుగున్నరేళ్లుగా తాను చేసిందేమీలేదని చంద్రబాబు స్వయంగా ఒప్పుకున్నట్టే అవుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: