నాయకుడు ఎప్పుడూ ముందుండి నడిపించాలి. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించాలి. తన కష్టాలను ప్రజల కోసం దిగమింగాలి.. ఇప్పుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేస్తున్నది అక్షరాలా ఇదే. జనం కోసం ఆయన తన బాధను గుండెల్లో అణిచివేస్తున్నాడు. 



సొంత బాబాయి దారుణంగా హత్య చేయబడ్డాడు. తండ్రి తర్వాత తండ్రి అంతటి వ్యక్తిని.. వివాదరహితుడుని పొట్టన పెట్టుకున్నారు. అదీ తన సొంత జిల్లాలో .. ఇదే ఘటన కడపజిల్లాలో గతంలో జరిగి ఉంటే శాంతి భద్రతలు అదుపుతప్పేవి..

సంబంధిత చిత్రం

ఫ్యాక్షన్ జిల్లా ముద్రపడిన ఆ జిల్లాలో ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్న తలలు తెగేవి. కానీ వేళ కాని వేళ ఆవేశం కూడదంటూ జగన్ ఆ బాధను దిగమింగాడు. అందులోనూ ఎన్నికల సమయంలో ప్రజలను ఆవేశపరచకూడదనుకున్నాడు. జనం కోసం  చంద్రబాబు సర్కారును గద్దెదింపాలన్న లక్ష్యానికి ఆటంకం కలగకూడదనుకున్నాడు. 

y s jagan latest meeting కోసం చిత్ర ఫలితం

అందుకే గుండెల్లో కొండంత బాధ ఉన్నా.. పార్టీ అధ్యక్షుడుగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాడు. గుండెల్లో బాధను దిగమింగుకుంటూనే ఇడుపులపాయలో పార్టీ అభ్యర్థులను ప్రకటించాడు. ఇప్పుడు అదే అభ్యర్థుల గెలుపు కోసం రాష్ట్రమంతా పర్యటిస్తున్నారు. జగన్ కష్టాన్ని జనం గుర్తించకపోరు. 



మరింత సమాచారం తెలుసుకోండి: