ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?" అనే సామేత నిజంచేశాడు మరోసారి మంగళరిగి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ బాబు.  ఇప్పటికే పలు సందర్భంల్లో తన చిత్ర విచిత్ర ప్రసంగాలతో అబాసు పాలైన లోకేష్ మరోసారి ఎన్నికల అఫిడవిట్‌లోనూ తప్పు చేసి నవ్వుల పాలయ్యారు. అఫడవిట్‌లో భర్తపేరు దగ్గర తండ్రి పేరు రాసి ఇచ్చారని, తండ్రి చంద్రబాబు నాయుడు అఫిడవిట్‌ను కాపీ చేశారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్విటర్‌ వేదికగా విమర్శించారు.

ఇటీవల ఎన్నికల ప్రచారంలో నోరు జారి పప్పులో కాలేసిన తన అఫిడవేట్ లో కూడా తప్పల తడకలా మార్చిన విదానంపై నెటిజన్లు నవ్వుకుంటున్నారని అన్నారు.  అవినీతిలో బాబును కి కాపీ..అతి తెలివితేటల్లో బాబుకి  కలర్ జిరాక్స్ అనుకున్నాం. 

ఇప్పుడు అఫిడవిట్ లోనూ కాపీనేనా!? ఇద్దరికి అఫిడవిట్ సరిగ్గా వేయడం రాదు కానీ అమరావతిని అమెరికా చేస్తా అని కేఏ పాల్ కబుర్ల చెబుతారు అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.  ఇలాంటి నాయకులు మన ఏపికి దాపురించారని ఇది ముమ్మాటికి మా కర్మ అని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: