హిందూపూర్.. ఏపీలో ఇప్పుడు ఎక్కువ అటెన్షన్ సంపాదించుకున్న ఎంపీ స్థానం. ఇక్కడ పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ సీఐగా పని చేసి స్వచ్ఛంద పదవీవిరమణకు కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఏపీ సర్కారు ఆయన్ను రిలీవ్ చేయకుండా ఇబ్బంది పెడుతోంది. 

సంబంధిత చిత్రం

అయితే అభ్యర్థి ఎవరైనా సరే.. గెలుపు ఎవరిదన్న అంశంపై అనేక సర్వే సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. ఓ సర్వే సంస్థ ఆంధ్రావ్యాప్తంగా 100 నియోజకవర్గాలు సర్వే చేసింది. ఆ సర్వే రిపోర్టు ఆధారంగా హిందూపూర్‌తో పాటు 15 ఎంపీ నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారనే అంశంపై ఓ అంచనాకు వచ్చింది. హిందూపూర్ విషయానికి వస్తే.. ఇక్కడ ప్రధాన పార్టీలు మూడూ బరిలో ఉన్నాయి. 

hindupur mp politics కోసం చిత్ర ఫలితం

హిందూపూర్‌లో రాప్తాడు, మడకసిర, హిందూపూర్, పెనుకొండ, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో మడకశిర ఎస్సీ రిజర్వుడు స్థానం.  ఈ సర్వే ప్రకారం హిందూపూర్‌లో టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీ సాగుతోంది. 

hindupur mp politics కోసం చిత్ర ఫలితం
రాష్ట్రంలో తెలుగుదేశం బలంగా వైసీపీకి పోటీ ఇస్తున్న స్థానాల్లో హిందూపూర్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఈ సర్వే చపట్టిన 15 ఎంపీ నియోజకవర్గాల్లో తెలుగుదేశానికి కాస్తో కూస్తో  గెలుపు అవకాశాలు ఇక్కడే కనిపిస్తున్నాయి. తెలుగుదేశం, వైసీపీ హోరాహోరీ పోరులో ప్రస్తుతానికి వైసీపీ మొదటి స్థానంలో ఉండగా.. కొద్దిపాటి తేడాతో టీడీపీ సెకండ్ ప్లేస్‌లో ఉంది. పరిస్థతి ఇలాగే కొనసాగితే వైసీపీ గెలుస్తుంది. కాస్త పుంజుకుంటే టీడీపీకి కూడా విజయావకాశాలు ఉన్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: