వైఎస్ జగన్మోహనరెడ్డి గత కొంతకాలంగా వినిపిస్తున్నమాట "నవరత్నాలు" నైన్ జెంస్, రానున్న సాధారణ ఎన్నికల్లో తమ వైసిపిని గెలిపిస్తే, అధికారం చేపట్టాక తాను చేపట్టబోయే పథకాల గురించి ఆయన చెబుతున్నారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా నవరత్నాలకు ఆకృతి నిచ్చామని ఆ పేరుతో సంక్షేమ పథకాలు అమలు చేస్తానని హామీ ఇస్తున్నారు. అందుకే పాదయాత్రలో ఊరూ వాడా దద్ధరిల్లేలా, ప్రతిపక్షాల గుండెలదిరేలా, ఓటర్ల మనసులకు నేరుగా తాకేలా, జగన్ పదే పదే నవరత్నాలు గురించి ప్రచారం చేస్తున్నారు. 
navaratnaalu proposed by jagan కోసం చిత్ర ఫలితం
టీడీపీ మాదిరిగా లెక్కలేనన్ని హామీలతో మ్యానిఫెస్టోని నింపేసి ఒక పుస్తకం ముద్రించ బోమని జగన్ ఎద్దేవా చేస్తున్నారు. పాదయాత్రలో ప్రజల సాదకబాధలు తెలుసుకుని, వారి ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా తమ పార్టీ మ్యానిఫెస్టోను రూపొందించామని చెబుతున్నారు. కేవలం రెండే రెండు పేజీల్లో తమ మ్యానిఫెస్టో ఉంటుందని, ఆ రెండు పేజీల్లోనే నవరత్నాల గురించి వివరిస్తామని జగన్ ప్రచారం చేస్తున్నారు.

నవరత్నాలు

1 వైసీపీ రైతు భరోసా
2 ఫీజు రీయింబర్స్మెంట్
3 ఆరోగ్యశ్రీ
4 జలయజ్ఞం
5 మద్యపాన నిషేధం
6 అమ్మ ఒడి
7 వైఎస్ఆర్ ఆసరా
8 అర్హులందరికీ ఇల్లు
9 పెన్షన్ల పెంపు

ఇవీ జగన్ చెబుతున్న సంక్షేమ పథకాలు. ఈ 9 పథకాలతోనే మహిళలు, వికలాంగులు, వితంతువులు, రైతులు, వృద్ధులు, విద్యార్ధులు, ఉద్యోగులు ఇలా అన్నివర్గాల వారికి లబ్ది చేకూరేలా ఆయన ప్రణాళిక సిద్ధం చేశారు. పాదయాత్రలో 60 ఏళ్ల పైబడిన తాత, అవ్వ వచ్చినా జగన్ చాలా ఓపికగా ఈ నవరత్నాల గురించి స్వయంగా వారి చెవిలో చెబుతున్నారు. 
navaratnaalu proposed by jagan కోసం చిత్ర ఫలితం
ఇప్పటికే వీటికి గురించి జనంలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. వాటి సాధ్యాసాధ్యాలకు బడ్జెట్ సరిపోతుందా? లేదా? అనే అంశాన్ని పక్కన పెడితే, జనంలో ఆశాజనక మైన  వాతావరణం నెలకోవటం మొదలైంది. వాగ్ధానాలు చేసిన వారు నిన్న మొన్నటి వరకు ఎన్నికల మానిఫెస్టో మూలన పారేసి చివరి నిముషములో అర్ధాంతరంగా నవరత్నాలను కాపీ చేసి అమలు చేయటం మొదలెట్టటమే నవరత్నాలు విజయవంతమైన భావన జగన్ అధికారంలోకి రాకుండానే నెలకొంది. 


ప్రస్తుత ప్రభుత్వం  2014 లో అధికారంలోకి రావటం కోసమే ఇచ్చిన 600 వాగ్ధానాలలో 60 కూడా నెరవేర్చని పరిస్థితుల్లో ఉంది. జన విశ్వాసం కోల్పోయిన తరుణంలో ఎదో తూ....తూ.... మంత్రంగా  నవరత్నాలు  ఆధారం చేసుకున్న నమూనాను అమలు చేస్తుండటం "నవరత్నాలు" విజయవంతమైనట్లే నని తెలుస్తుంది.  అయితే ఇంతకాలం టిడిపిని నమ్మి మోసపోయామని ఇప్పుడు జగన్మోహనరెడ్డికి కూడా ఒక అవకాశమిచ్చే పోజిటివ్ వైబ్రేషన్స్ ఏపి ప్రజల్లో ఆల్రెడీ మొదలయ్యాయి. పాదయాత్రకు అశేషంగా తరలివచ్చిన జనం - ఎన్నుకల బహిరంగ సభలను జయప్రధం చేస్తున్న జనప్రభంజనాన్ని చూస్తూ జగన్ కూడా రెట్టించిన ఉత్సాహంతో, చాలా ఓపికగా ప్రతి ఒక్కరికీ నవరత్నాల పథకాల గురించి చేరేలా ప్రసంగిస్తున్నారు. 
navaratnaalu proposed by jagan కోసం చిత్ర ఫలితం
ఒక రకంగా జగన్ వీటిపై జనంలో చర్చ జరిగేలా, జగన్ అధికారంలోకి వస్తే వీటి ద్వారా తమకు మేలు కలుగుతుందేనే నమ్మకాన్ని కలిగించడంలో విజయం సాధించారు. కానీ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధులు, నియోజకవర్గాల ఇంచార్జులు, కో ఆర్డినేటర్లు మాత్రం నవరత్నాల గురించి పూర్తి స్థాయి ప్రచారం కల్పించటానికి ప్రజల్లోకి తీసుకు పోతున్నారు. వాళ్లు కూడా పూర్తిగా వీటి ప్రచారంపైనే పూర్తిగా ఫోకస్ పెట్టి ప్రచారం చేస్తే వచ్చే ఎన్నికలే టీడీపీకి చరమ గెతం పలుకుతాయని జగన్ విశ్వాసం. అందుకే వీటిని జగన్ చేతిలోని ‘నవరత్నాలు’ కాదు ‘నవఅస్త్రాశస్త్రాలు" అని కొనియాడుతున్నారు. 

navaratnaalu proposed by jagan కోసం చిత్ర ఫలితం

పాదయాత్రలో జగన్ ప్రకటించిన ముఖ్యమైన హామీలు ఇవీ...

  • అధికారంలోకి రాగానే.. పిల్లల్ని బడికి పంపించే ప్రతి తల్లికీ ‘అమ్మ ఒడి’ పథకం కింద ఏటా రూ. 15,000 అందిస్తాం. పిల్లలు ఎంత పెద్ద చదువు చదివితే అంతవరకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. వేరే ప్రాంతాల్లో చదువుకునే పిల్లల హాస్టల్‌ ఖర్చు కింద ఏటా రూ. 20,000 ఇస్తాం.
  • వృద్ధాప్య పెన్షన్‌ వయసును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తాం. అందరికీ నెలకు రూ. 2,000 పింఛన్‌ ఇస్తాం. వికలాంగులకు రూ. 3,000 పింఛను ఇస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 45 ఏళ్లకే వైఎస్సార్‌ చేయూత పెన్షన్‌ పథకం కింద నెలకు రూ. 2,000 అందిస్తాం.
  • ప్రతి రైతు కుటుంబానికి రైతన్న భరోసా పేరుతో ఏటా మే నెలలో రూ. 12,500 ఇస్తాం. నాలుగు పర్యాయాలు రూ. 12,500 చొప్పున మొత్తం రూ. 50,000 అందిస్తాం. వడ్డీ లేని పంట రుణాలు, తొమ్మిది గంటలు పగటిపూట ఉచిత విద్యుత్‌ ఇస్తాం. రూ. 3,000 కోట్లతో ధరల స్ధిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం. పంట ధరను ముందే నిర్ణయిస్తాం. అదే రేటుకు ఎవరూ కొనకపోతే ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వంతో కలిసి రూ. 4,000 కోట్లతో ప్రకృతి విపత్తు పరిహార నిధి ఏర్పాటు చేస్తాం. ప్రతి మండలంలో కోల్డ్‌ స్టోరేజీలు, గోదాములు నిర్మించి, రైతులు ఉచితంగా వాడుకునే ఏర్పాట్లు చేస్తాం.
  • వైద్యం ఖర్చు రూ. 1000 దాటే ఏ వ్యాధి అయినా ఆరోగ్యశ్రీ పథకం కిందకు తీసుకువచ్చి వైద్యం చేయిస్తాం. ఎంతటి పెద్ద ఆపరేషన్‌ అయినా చేయిస్తాం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఎక్కడైనా సరే నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తాం. తలసేమియా, మూత్ర పిండాలు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు.. డాక్టర్‌ సలహా మేరకు రూ. 10,000 పింఛన్‌ ఇస్తాం.
ప్రజాసంకల్పయాత్రలో జగన్‌మోహన్‌రెడ్డి
  • డ్వాక్రా మహిళలు ఎన్నికలు అయిపోయిన తర్వాత బ్యాంకులకు వెళ్లి.. అప్పు ఎంత ఉందో రశీదు తీసుకోండి. మా ప్రభుత్వం రాగానే ఆ మొత్తాన్ని నాలుగు దఫాలుగా వారి చేతికే ఇస్తాం. ఆ సొమ్ముతో ఏమైనా చేసుకోవచ్చు. బ్యాంకులకు వడ్డీ లెక్కలు కడతాం. సున్నా వడ్డీకి రుణాలు ఇప్పిస్తాం.
  • ప్రతి పేద వాడికీ ఇల్లు కట్టిస్తాం. ఏటా ఐదు లక్షలు చొప్పున ఐదేళ్లలో అక్షరాలా 25 లక్షల ఇళ్లు కట్టిస్తాం. ఆ ఇంటిని మహిళల పేరిట రిజిస్ట్రేషన్‌ చేయిస్తాం. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ ఇంటిని తాకట్టు పెట్టి బ్యాంకు నుంచి పావలా వడ్డీకి అప్పు తీసుకునేలా ఏర్పాటు చేయిస్తాం.
  • మూడు దఫాలుగా మద్య నిషేధాన్ని అమలు చేస్తాం. తాగుడు మానివేసినప్పుడు ఎదురయ్యే సమస్యలకు చికిత్స కోసం ప్రతి నియోజకవర్గంలో ఆస్పత్రిని ఏర్పాటు చేస్తాం. మళ్లీ ఎన్నికలు వచ్చే సమయానికి పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం. ఆ తర్వాతే మళ్లీ ఓట్లేయండని అడుగుతాం.
  • ప్రతి ఊర్లో గ్రామ సచివాలయం ఏర్పాటు చేస్తాం. ఆ ఊరి వాళ్లకే 10 మందికి అందులో ఉద్యోగమిస్తాం. ఇళ్లు, పెన్షన్‌, రేషన్‌కార్డులు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ ఇవన్నీ 72 గంటల్లోనే మంజూరుచేస్తాం.
  • అధికారంలోకి వస్తే.. ఇమామ్‌లకు రూ. 10,000, మౌజన్‌లకు రూ. 5,000 గౌరవ వేతనం ఇస్తాం. మసీదు, చర్చి, గుడికి ప్రభుత్వం సహాయం చేస్తుంది. ఒక్కోదానికి రూ.15 వేలు ఇస్తాం.
  • సంబంధిత చిత్రం

మరింత సమాచారం తెలుసుకోండి: