ఉగ్రవాదంపై ఉక్కుపిడికిలి బిగించాలని దానిపై స్థిరమైన, అర్థవంతమైన గుణాత్మక చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్‌ కు అమెరికా మరోసారి సూచించింది.  భారత్‌ పై మరో ఉగ్రదాడి జరిగిన పక్షంలో పరిస్థితులు తీవ్రాతి తీవ్రమైన పరిణామాలకు దారి తీసే అవకాశం ఉందని హెచ్చరించింది.

 terror attack on india white house comment కోసం చిత్ర ఫలితం

“ఉగ్రవాదం పై పాక్ నిర్మాణాత్మక, స్థిరమైన చర్యలు తీసుకోవలసిన సమయమిదని ఆ అవసరం కూడా ఉందని -  ముఖ్యంగా జైష్ ఏ మహ్మద్‌, లష్కర్ ఏ తోయిబా సంస్థల కార్యకలాపాలపై దృష్టి పెట్టి పటిష్ఠమైన  చర్యలు తీసుకోవాలి. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గే అవకాశం ఉంది’’ అని వైట్ హౌజ్  ఉన్నతాధికారి ఒకరు అన్నారు.

 

ఉగ్రవాద సంస్థలపై సరైన చర్యలు తీసుకోకుండా ఉండి, భారత్‌ పై మరో ఉగ్రదాడి జరిగితే అది పాఖ్ కు చాలా అరిష్టమని అది దూసుకువచ్చే ప్రమాదం అని మరో అధికారి హెచ్చరించారు.

 terror attack on india white house comment కోసం చిత్ర ఫలితం

దీంతో ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందన్నారు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం ప్రపంచ దేశాల నుంచి పాక్ పై ఒత్తిడి పెరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ ఎటువంటి చర్యలు చేపట్టిందన్న అంశంపై అమెరికా అధికారులు స్పందించారు.

white house కోసం చిత్ర ఫలితం 

ఇటీవల పాక్‌ ఉగ్రవాదంపై చర్యలు ప్రారంభించినట్లు అర్థమవుతోందని వారు అభిప్రాయపడ్డారు. అందులో భాగంగా జైష్ ఏ మహ్మద్ (జేఈఎం) లాంటి ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలపై నియంత్రణ విధించారన్నారు.  ఉగ్రనేతల ఆస్తులను సైతం జప్తు చేసినట్లు పేర్కొన్నారు. అయితే వారు ఎలాంటి చర్యలు చేపడుతున్నారో? ఇప్పుడే ఒక స్పష్టమైన అంచనాకు రాలేమని స్పష్టం చేశారు.

 

గతంలోనూ కొంత మందిని అరెస్టు చేసినప్పటికీ అనంతర కాలంలో వారిని విడుదల చేశారని గుర్తుచేశారు. ఇప్పటికీ కొంత మంది ఉగ్రనేతలు పాక్ లో ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తున్నారన్నారు.

 terror attack on india white house comment కోసం చిత్ర ఫలితం

ఆమెరికా ఆర్థిక చర్యల కార్య దళం(ఎఫ్‌ఏటీఎఫ్‌) నుంచి పొంచి ఉన్న ముప్పు కారణంగానే పాక్ ఈ మాత్రమీనా చర్యలకు పూనుకున్నట్లు అర్థమవుతోందిని అమెరికా అధికారులు అభిప్రాయపడ్డారు. లేని పక్షంలో భవిష్యత్తులో పాక్‌ తీవ్ర ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవాల్సిన ప్రమాదం ఉందని హెచ్చరించారు.

 

ఇరుదేశాల మధ్య ప్రస్తుత పరిస్థితులు కాస్త చల్లబడ్డప్పటికీ, సైనిక దళాలు మాత్రం సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉన్నాయని అన్నారు. మరో దాడి జరిగిన పక్షంలో ఇరు దేశాల మధ్య పరిస్థితులు చేజారిపోయే అవకాశం ఉందని అన్నారు. పుల్వామా దాడి, అనంతరం ఉగ్రస్థావరాల పై భారత వైమానిక దళం జరిపిన దాడుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.  దీంతో రంగంలోకి దిగిన అమెరికా ఇరు దేశాల ప్రతినిధులతో నిరంతర చర్చలు జరిపింది.

 indo america relations కోసం చిత్ర ఫలితం

పరిస్థితులు చేజారిపోకుండా చూడాలని పాక్ కు పదే పదే సూచించింది. ఉగ్రవాదంపై పాకిస్థాన్‌ పటిష్ఠ చర్యలు తీసు కోవాలని హెచ్చరించింది. అలాగే ప్రపంచ దేశాలు భారత్‌ కు మద్దతుగా నిలిచాయి. పాక్‌ పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెంచాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: