సింహం సింగిల్ గా వస్తుంది పందులు గుంపులుగా వస్తాయని జగన్ అభిమానులు తమనేతకు నీరాజనాలు పలికే సంగతితెలిసిందే! ఇది యాదృచ్చికమా! పరిస్థితుల ప్రభావమా! పరిస్థితులే అని చెప్పాలి! ఎందుకంటే 2014లో సోనియాగాంధీని ధిక్కరించిన ధీరునిగా ఆయనకు పేరు రాకుండా చేయడం ఇటు కాంగ్రెసు నేతలు, అటు టీడీపీ అధినేత తమతమ ఉనికిని కాపాడుకోలేమా అన్న భీతిలో కుమ్మక్కు రాజకీయాలు చేశారు. ఫలితంగా రెండుపార్టీలు జగన్ పై ఒక్కటై కుట్రలు చేశారు. జగన్ ని జైలు పాలు చేశారు. కమ్యూనిస్టులు కొంతమేర జగన్ తో కలసివేళ్ళాలని చేసిన ప్రయత్నాలుఫలించలేదు. తీరా ఎన్నికలసమయంలో విభజన పాపాన్ని కేవలం కాంగ్రెసుపార్టీకే అంటగట్టి చంద్రబాబు తన అవకాశవాద తత్వంతో దేశవ్యాప్తంగా మోదీ మానియా ఉండటాన్ని పసిగట్టి తంటాలు పడిమరీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. అప్పటికే బీజేపీ కోసం పనిచేస్తున్న పవన్ కూడా చంద్రబాబుకె జై అన్నాడు.

Related image

ఇక వర్తమానం 2019లోకి వస్తే దాదాపుగా మూడున్నర ఏళ్లపాటుగా చంద్రబాబును కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన పవన్ ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ లపై అవినీతి ఆరోపణలతో విరుచుకుపడ్డారు ప్రజల సొమ్ముస్వాహా చేసిన తండ్రి, కొడుకులు ఎన్నికల్లో ఖర్చు చేయడానికి ఒక్కో నియోజకవర్గoలో 25 కోట్లు పంపిణీచేశారని విమర్శించడంతో ముక్కోణపు పోటీ తప్పదేమో! లేక అధికారపక్షం పై జగన్, పవన్ లు ఒక్కటై పోరాడతారేమో అని భావించారు ప్రజలు! చిత్రంగా తన ప్రత్యర్థి జగన్ మాత్రమేనన్నట్లు చంద్రబాబుపై తనవైఖరిని మార్చుకున్న పవన్ మళ్లీ ఆయానతోనే లోపాయకారి ఒప్పందం (ప్యాకేజీ) కుదుర్చుకున్నారు. మరోవైపు విభజన హామీలను నెరవేర్చడంలో ముఖ్యంగా ప్రత్యేకహోదాఅంశాన్ని దూరంగా ఉంచడంలో కలసి పనిచేసిన బీజేపీ,టీడీపీలు ఎన్నికల ముందు విడిపోయాయి.
Image result for ys jaganmohan reddy
అదికూడా హామీలు నెరవేర్చడంలో వైఫల్యాన్ని బీజేపీపై మాత్రమే నెట్టాలనే వ్యూహంతోనే చంద్రబాబు తన అవకాశవాద తత్వాన్ని మరోసారి బయట పెట్టి ఏపీలో బీజేపీని దోషిగా చూపడంలో సఫలీకృతం అయ్యాడు. ఇప్పటిదాకా ముసుగులో కాంగ్రెసుపార్టీతో కలిసిపని చేసిన చంద్రబాబు ఇప్పుడు బహిరంగంగానే జాతీయస్థాయిలో పొత్తుకు తెరలేపి ఏపీలో జగన్ మా ప్రధమశత్రువు అనేమాటను రాహుల్ గాంధీ చేత చెప్పించాడు. మరోవైపు పవన్ ఇటు కమ్యూనిస్టులను అటు చంద్రబాబు సూచన మేరకు బీఎస్పీ తోనూ పొత్తు పెట్టుకుని జగన్ ను ఒంటరి వాడిని చేశారు. ఎన్ని ముసుగు రాజకీయాలు చేసినా ప్రజలనే నమ్ముకుని ప్రత్యేకహోదా కోసం, ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తూ ప్రజల మధ్యే ఉంటున్న జగన్  గెలుస్తాడా! అందరూకలిసి చంద్రబాబుకు ప్రత్యక్ష,పరోక్ష సహకారాలు చంద్రబాబుకు అందించి ఆయన్నే గెలిపిస్తారా? ఏప్రిల్ 11న తెలుస్తుంది!!


మరింత సమాచారం తెలుసుకోండి: