ఔను.. నిజమే.. అక్కడ టీడీపీ ఓడిందంటే.. ఇక రాష్ట్రంలో టీడీపీ పని అయిపోయినట్టే.. జగన్ సీఎం అయినట్టే..అదేంటి.. ఆ ఒక్క సీట్లో ఓడితే ఏమవుతుంది. అంటారా.. అదే మరి సెంటిమెంట్ అంటే.. ఎన్నికలు అనగానే రాజకీయ పార్టీలు, నాయకులు రకరకాల సెంటిమెంట్లను తెరపైకి తెస్తుంటారు.


అలాంటి సెంటిమెంట్‌కు బలం చేకూరుస్తోంది. గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గం. 1955లో సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటైంది. సత్తెనపల్లిలో టీడీపీ గెల్చినప్పుడు.. రాష్ట్రంలోనూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తోంది. సత్తెనపల్లిలో ఓడిపోయితే పార్టీ అధికారానికి దూరమవుతోంది.


1983లో టీడీపీ అభ్యర్థిగా నన్నపనేని రాజకుమారి గెలిచారు. టీడీపీకి అధికారం దక్కింది. 1985 ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఇక్కడ సీపీఎం అభ్యర్థి గెలిచారు. మళ్లీ టీడీపీదే అధికారం. 1989లో టీడీపీ మద్దతిచ్చిన సీపీఎం అభ్యర్ధి ఓడిపోయారు. తెలుగుదేశం అధికారానికి దూరమైంది. 1994లో వామపక్ష అభ్యర్థి గెలిచారు. మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది.


1999లో వైవీ ఆంజనేయులు గెలిచారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎర్రం వెంకటేశ్వర్ రెడ్డి గెలిచారు. ఆ రెండు సార్లు టీడీపీకి అధికారం దక్కలేదు. 2014లో కోడెల గెలిచారు. మళ్లీ తెలుగుదేశం అధికారం చేసుకుంది. మరి ఇప్పుడు ఒప్పుకుంటారా.. ఇక్కడ టీడీపీ ఓడితే.. కాబోయే సీఎం జగనే అని.



మరింత సమాచారం తెలుసుకోండి: