రాష్ట్రంలో రాజకీయాలతో హోరాహోరీగా ఎన్నికలు జరిగే ప్రాంతాలకు భిన్నంగా కుల సమీకరణలతోనే అమలాపురం నియోజకవర్గంలో ఎన్నికల పోరు నడుస్తోంది. అలాంటి అమలాపురంలో ఈసారి ఫ్యాన్, సైకిల్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. అయితే కాపు సామాజికవర్గ ఓటర్లు కూడా ఎక్కువ ఉన్న అమలాపురంలో జనసేన కూడా పోటీకి దిగడంతో ఎన్నికల్లో ఎలాంటి ఫలితం వస్తుందా అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  


ఇక గత ఎన్నికల్లో తెదేపా తరుపున ఐతాబత్తుల ఆనందరావు.. వైకాపా నుంచి గొల్ల బాబూరావుపై 12వేల ఓట్ల తేడాతో గెలిచారు. ఈసారి కూడా ఆనందరావు మరోసారి తెదేపా తరుపున బరిలోకి దిగుతున్నారు. ఈయనపైనా అటు ప్రజల్లోనూ...తెదేపా కేడర్‌లోనూ చాలా వ్యతిరేకత ఉంది. అధికారంలోకి వచ్చాక కేడర్‌ని పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. అయితే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, చంద్రబాబు ఇమేజ్ మాత్రమే ఆనందరావుని గట్టెంక్కించాలి.


అటు గొల్ల బాబురావుని పక్కన బెట్టి సీనియర్ నేత, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్‌కి వైకాపా టికెట్ ఇచ్చింది. ఆయన 2009లో అమలాపురం కాంగ్రెస్ నుంచి గెలిచి మంత్రిగా చేసిన అనుభవం కూడా ఉంది.  దీంతో ఇది వైకాపాకి ప్లస్ కానుంది. అటు తెదేపా మీద వ్యతిరేకత...జగన్‌కి పెరిగిన బలం కలిసొస్తాయని విశ్వరూప్ నమ్మకంతో ఉన్నారు. అయితే అన్నీ రకాలుగా వైకాపాకి అనుకూల వాతావరణం ఉన్న...జనసేన పోటీ ప్రభావం వైకాపాపై పడే అవకాశం ఎక్కువ ఉంది. కాపు ఓటర్లు ఎక్కువ ఉన్న అమలాపురంలో జనసేన నుంచి శేఖర్ పోటీ చేస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో త్రిముఖ పోరు జరిగే అవకాశం కనిపిస్తోంది.


ఈ నియోయజకవర్గంలో ఉప్పలగుప్తం, అల్లవరం, అమలాపురం మండలాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ కాపులు, బీసీలు, ఎస్సీలు ఎక్కువ వీరే అభ్యర్ధిని గెలుపుని డిసైడ్ చేయనున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ వైకాపా అభ్యర్ధి విశ్వరూప్‌కి కొంత వరకు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ బలమైన కేడర్ ఉన్న తెదేపాని తక్కువ అంచనా వేస్తే అంతే సంగతులు. అదే సమయంలో జనసేన ఓట్లు చీలిక ప్రభావం ఏ పార్టీకి నష్టం తెస్తుందో చూడాలి. ఏది ఏమైనా ఫ్యాన్, సైకిల్ మధ్య టఫ్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: