చంద్రబాబు నాయుడు ఈ పేరే ఒక బ్రాండ్ అని చెప్పుకుంటారు తేదేపా కార్యకర్తలు. అడ్మినిస్ట్రేటర్ గా, కష్టించి పనిచేసే వ్యక్త త్వం గల రాజకీయ నాయకుడిగా, జాతీయ నాయకుడిగా సుపరిచితమైన పేరిది.  ఏంటో ఈ టర్మ్ ముఖ్యమంత్రయిన దగ్గర్నుండి దాదాపు 35 ఏళ్లు కష్టపడి సంపాదంచుకున్న పేరుమొత్తం సంద్రంలో కలుస్తున్నట్లుంది నాయుడిగారి పరిస్థితి. 


 ఒక మాట అనడం  దానికి విరుద్దంగా ప్రవర్తించడం  మళ్లా ఆ మాటకు నాకు ఏమీ సంబంధం లేదనడం  చివరాఖరుకి తూచ్ ఇదంతా కాదు ముందు చెప్పిందే ఆఖరు మద్యలో నే చెప్పిందాంతో నాకేం సంబంధం లేదన్నట్లు వ్యవహరించడం  ప్రజల్ని మభ్య పెట్టాలనుకోవడం ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి ఆయన నాయకత్వంలో ఉన్న తెలుగు దేశం ప్రభుత్వానికి పరిపాటయినాయి.  ప్రత్యేక హోదా గురించి బాబోరేసిన పిల్లమొద్టలు ఎన్నెన్నో.?


ఎవరు చేసిన ఖర్మ వారన్నట్లుగా ఇప్పడుు ఆ పిల్లమొగ్గలే బాబుగారి ఆంధ్రప్రజ నిలదీసే విధంగా చేయబోతున్నాయా అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశలకులు.  కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అలనాడు  హోదా వద్దు..ప్యాకేజినే ముద్ద అంటూ లిఖిత పూర్వకంగా ఇచ్చిన ఆంధప్రద్యే ప్రభుత్వం తాఖీదుని బయట పెట్టారు.  చంద్రసారూ..ఇవ్వాళ రేపూ అందరూ పరన్నమే తింటున్నారు..ఎవరిని — ఎవరు మభ్య పరచలేరంటున్నారు బీజేపీ నాయకులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: