ఏపీ ఎన్నికల షెడ్యూల్ వచ్చే ముందు ఏపీలో కొన్ని సంఘటనలు జరిగాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కొందరు ఎమ్మెల్యేలుగా బరిలో దిగే నాయకులతో రాజీనామాలు చేయించారు. మీరు ఎలాగూ ఎమ్మెల్యేలు అవుతారు.. మరి ఎమ్మెల్సీ ఇంకో నాయకుడికి ఇవ్వొచ్చు కదా అన్నది చంద్రబాబు లాజక్.


ఈ లాజిక్ బాగానే ఉంది. దీని ప్రకారమే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రామసుబ్బారెడ్డి వంటి నాయకులతో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయించారు. వాటిని వేరే అసంతృప్తి నాయకులకు ఇచ్చి బుజ్జగించారు. అయితే ఇంత చాణక్యం చూపిన చంద్రబాబు ఎమ్మెల్సీగానే మంత్రి అయిన తన కొడుకు లోకేశ్ తో మాత్రం రాజీనామా చేయించలేదు. 

వాస్తవానికి మొదట్లో లోకేశ్ కూడా రాజీనామా చేయబోతున్నాడు.. అంటూ వార్తలు ఎల్లో మీడియాలో వచ్చాయి కూడా. కానీ పాపం.. చంద్రబాబుకు లోకేశ్ గెలుపుపై నమ్మకం లేదట. అందుకే లోకేశ్ తో మాత్రం రాజీనామా చేయించలేదట. ఈ విషయాన్ని గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.

లోకేశ్ సత్తా ఏంటో చంద్రబాబుకు తెలుసు కాబట్టే ఆయనతో రాజీనామా చేయించలేదని కొడాలి నాని వివరించారు. అంతే కాదు. చంద్రబాబు కూడా ఏనాడూ స్వయం ప్రకాశం కాదని..గతంలో వాజ్‌ పేయి ప్రభతో ఓసారి.. మోడీ ప్రభతో మరోసారి ముఖ్యమంత్రి అయ్యాడని.. ఈసారి ఘోర పరాజయం తప్పదని కొడాలి నాని తేల్చి చెప్పారు. మరి కొడాలి నాని చెప్పినదాంట్లో కూడా లాజిక్ ఉంది కదా.



మరింత సమాచారం తెలుసుకోండి: