ఉత్తరప్రదేశ్‌లో విపక్షాల కూటమికి ప్రధాని నరేంద్ర మోదీ కొత్త పేరు పెట్టారు. యూపీలో సమాజ్ వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్ దళ్, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ కలసి పోటీ చేస్తున్నాయి. దీంతో ఆ మూడు పార్టీల పేర్లలో నుంచి మొదటి అక్షరాలను తీసుకున్న ప్రధాని మోదీ, ఆ కూటమికి "షరాబ్" మత్తు పానీయం  అని పేరు పెట్టారు. ఉత్తర ప్రదేశ్‌ లోని మీరట్‌లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ‘సమాజ్ వాదీలోని Sa , ఆర్‌ఎల్డీ‌లోని raa, బహుజన్ సమాజ్ వాదీలోని b. యూపీ ఆరోగ్యం కోసం భారత్ భవిష్యత్ కోసం మీరు (Sarab) ఆ ‘శరాబ్‌’ కి దూరంగా ఉండండి.’ ఈ శరాబ్ మీ జీవితాలను బర్‌ బాత్ చేసేస్తుంది.’ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

sarab కోసం చిత్ర ఫలితం

మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన “కనీస ఆదాయ పథకం” మీద కూడా విమర్శలు గుప్పించారు. పేదలకు ఏడుదశాబ్ధాల పాలనలో “బ్యాంక్ ఖాతాలు” కూడా తెరవని వాళ్లు, ఇప్పుడు బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు వేస్తామంటున్నారని విమర్శించారు.


మోదీ సెటైర్‌పై యూపీ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. ‘టెలీ ప్రాంప్టర్ వల్ల ప్రధాని మోదీకి దాని సరైన అర్థం తెలీదనుకుంటా? ‘సరబ్’ అంటే మరీచిక  మోదీ ఐదేళ్ల కాలంలో ప్రజలకు చూపించింది అదే. ఇప్పుడు కొత్తగా ఎన్నికలు వచ్చేసరికి మరో మరీచిక (ఎండమావి) ను చూపించడం మొదలు పెట్టారు.’ అని అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేశారు.

sp bsp rld కోసం చిత్ర ఫలితం

ఎన్నికల ప్రచారం ప్రారంభం సందర్భంగా ప్రధాని మోదీ, ఆర్‌ఎల్‌డీ నేత అజిత్ సింగ్ తండ్రి, మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్‌ కు నివాళి అర్పించారు. ఈ ఎన్నికల్లో ఎస్పీ- బీఎస్పీ-ఆర్‌ఎల్‌డీ కలసి పోటీ చేస్తున్నాయి. మరోవైపు తన ఐదేళ్ల కాలంలో ప్రభుత్వం భూమి, ఆకాశంలో కూడా ‘సర్జికల్ స్ట్రైక్’ చేసిందని చెప్పారు. ‘ఓ వైపు గట్టి చౌకీదార్ ఉన్నాడు. మరోవైపు కళంకితులైన నేతలు ఉన్నారు. ఎవరికి ఓటేయాలో ప్రజలు తేల్చుకోవాలి’ అని ప్రధాని మోదీ సూచించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: