ఇడు ఆరడుగుల బుల్లెట్టూ.. ఈ పాట జనసేన అధినేత పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలోది. సూపర్ డూపర్ హిట్ సినిమాలో ఆ పాట కూడా సూపర్ హిట్ అయ్యింది. హీరో ఇంట్రడక్షన్ ఘనంగా ఇచ్చింది. కానీ పాపం పవన్ కల్యాణ్ సినిమాల్లోనే హీరోగా మిగిలేలా ఉన్నారు. 


రాజకీయాల్లో మాత్రం పవన్ కల్యాణ్‌ ఆరడుగుల బుల్లెట్‌ కాలేకపోతున్నారు. అంతేకాదు... ఈ ఆరడుగుల బుల్లెట్ సాంగ్ వైఎస్ జగన్ జీవితానికి అతికినట్టు సరిపోతుంది. తండ్రి హఠాన్మరణంతో పార్టీలో తలెత్తిన ఇబ్బందులు. అధిష్టానానికి ఎదురుతిరిగినందుకు అడ్డగోలు కేసులతో కక్ష సాధింపు.. ఇలా ఆయన పడిన కష్టాలెన్నో. 

ఇలా కాదని సొంతంగా పార్టీ పెట్టుకున్నా.. ఆయన్ను చిదిమేయాలని ప్రయత్నించిన శత్రుగణం సామాన్యమైందేమీ కాదు.. కష్టపడి రాష్ట్రమంతా తిరిగి పార్టీని కాపాడుకుంటూ ఎన్నికలకు వెళితే.. అధికారం చేతికంద లేదు. పార్టీ తరపున గెలిచి ఎమ్మెల్యేల్లో చాలామందిని కోట్లు ఎరవేసి.. వివిధ ప్రలోభాల పేరిట లాగేసుకున్నారు.   

అలాంటి పరిస్థితుల్లో ఓ ప్రాంతీయ పార్టీని ఐదేళ్లపాటు కాపాడుకోవడమే కాదు.. రాష్ట్రంలోనే అతి బలీయమైన రాజకీయ శక్తిగా మార్చారు జగన్. తనకు అండగా నిలిచేవారు లేకున్నా.. రాజకీయ ప్రత్యర్థులు, మీడియా ప్రత్యర్థులు ఒక్కటై.. అడుగడుగునా మూకుమ్మడిగా దాడులు చేస్తున్నా.. ఒంటరిగానే ఎదుర్కొన్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీగా చెప్పుకునే నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తూ నిజమైన ఆరడుగుల బుల్లెట్టుగా మారారు.



మరింత సమాచారం తెలుసుకోండి: