గుడివాడ అసెంబ్లీ ఎన్నికల సమరం జోరుగా సాగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నాని.. తన నియోజకవర్గంలో జోరుగా పర్యటిస్తున్నారు. తన పర్యటనలో చంద్రబాబు, లోకేశ్ తీరును ఎండగడుతున్నారు. ఎన్టీఆర్ పార్టీని లాక్కున్న చంద్రబాబుకు సొంత టాలెంట్ లేదన్నారు. 


ఇక నారా లోకేశ్ గురించి కొడాలి నాని వేసిన సెటైర్లు బాగా పేలాయి. ఇటీవల తరచూ లోకేశ్ జగన్ గురించి కామెంట్ చేస్తున్నాడన్న నాని.. ఆ అర్హత లోకేశ్‌కు ఏమాత్రం లేదన్నారు. జగన్ తన తండ్రి చనిపోతే.. తండ్రిపేరుతో పార్టీ పెట్టుకుని జనంలోకి వెళ్లి వారి మద్దతు పొందాడని గుర్తు చేశారు. 

రేపు చంద్రబాబు కూడా చనిపోతాడని.. అప్పుడు లోకేశ్ సీబీఎన్‌ టీడీపీ అంటూ జనంలోకి వెళ్లి వారి ఆదరణ పొందగలడా.. అంత సత్తా ఉందా అని కొడాలి నాని నిలిదీశారు. లోకేశ్ జగన్‌తో పోల్చుకుంటే చూసి భరించే పరిస్థితి ఆంధ్రాప్రజలకు లేదని నాని అన్నారు. లోకేశ్‌కు వర్థంతికి, జయంతికీ తేడా తెలియదని.. తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటేస్తే మీ ఉరి మీరు వేసుకున్నట్టే అని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. 

అంత అసమర్థుడిని తీసుకొచ్చి టీడీపీకి ఛీఫ్ ను చేద్దామని చంద్రబాబు ప్రయత్నించడం దారుణం.. నీ చెంచాలను పెట్టుకుని లోకేశ్‌ను పొగిడించుకుండే పొగిడించుకోవచ్చని.. కానీ జగన్ పై అవాకులు చెవాకులు పేలితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు కొడాలి నాని. 



మరింత సమాచారం తెలుసుకోండి: