సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో తేదేపా తరువాతే దేశంలో మరే రాజకీయ పార్టీ అయినా..టెక్నాలజీ ఉపయోగించుకొని పార్టీని అభివృద్ది చేసుకోవడం.. పార్టీ కార్యకర్తలలో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ దిశా నిర్ధేశం చేయడంలో తెలుగు దేశం పార్టీనే భారత దేశంలో అగ్రగామి. 


ప్రతిరోజూ తేదేపా అధినేత వేలాది మంది కార్యకర్తలతో కాన్ఫిరెన్స్ లో మాట్లాడుతూ వారికి ప్రతిరోజూ దిశానిర్దేశం చేస్తున్నారు.  గత కొద్ది వారాలుగా పొద్దేన్నే ఈ కాన్ఫరెన్సు అయినప్పటి నుంచి తేదేపా అనుకూల మీడియా ఈ పాయింట్లంన్నింటిని తిప్పి-తిప్పి-తిప్పి ప్రచారం చేస్తుంటుంది. 


ఈ రోజు బాబుగారు చెప్పారని వస్తున్న ఒక పాయింట్ తేదేపా అధినేత అప్పుడే అస్త్రసన్యాసం చేసేశారు అన్నట్లుగా ఉంది.  అదే ! ‘ఎన్నికల్లో గెలుపోటముల పూర్తి బాధ్యత అభ్యర్థులదే’ - చంద్రబాబు.


2009 వైఎస్ రెండవసారి సీఎం పదవి కోసం ఆంధ్రప్రజ, ఓట్లను అభ్యర్థిస్తున్న రోజులవి..మొత్తం అపోజీషన్ పార్టీలన్నీ మహా కూటమై వైఎస్ చిత్తుగా ఓడిపోతారని చెప్పిన రోజులవి..అలాంటి పరిస్థితులలో కూడా గెలుపు - ఓటముల సంపూర్ణ బాధ్యత నాదే నంటూ వైఎస్ ఇచ్చిన ధీమా మరువలేనిది. అస్సులు ఆ ధీమానే వైఎస్ ని గెలిపించడదంటారు. మరి ఇప్పుడు బాబుగారు చేస్తున్నదీ?


మరింత సమాచారం తెలుసుకోండి: