వైసీపీ బలంగా ఉన్న స్థానాల్లో ఆ పార్టీని ఓడించేందుకు చంద్రబాబు కుట్రపన్నాడని వస్తున్న ఆరోపణలు నిజమేనంటున్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్.. తమ పార్టీకి చెందిన బీఫామ్స్, ఏ పామ్స్‌ ను టీడీపీకి చెందిన కొందరు పార్టీ కార్యాలయంపై దాడి చేసి దొంగిలించారని ఆయన ఆరోపించారు. 


మొత్తం 38 చోట్ల ప్రజాశాంతి పార్టీ పేరుతో టీడీపీ వ్యక్తులే నామినేషన్లు దాఖలు చేశారని కే ఏ పాల్ ఓ వీడియో ద్వారా బయటపెట్టారు. విజయవాడ ఐలాపురం హోటళ్లో తమ పార్టీ కార్యాలయంపై దాడి జరిగిందని.. విజయ్, సూర్య అనే వ్యక్తులను కొట్టి బీఫామ్స్ ఎత్తుకెళ్లారని పాల్ ఆరోపించారు. 

మొదట టీవీ9 రజినీకాంత్ ఈనెల 25న మీరు ఎంతకు అమ్ముడుపోయారని అని తనను అడిగినప్పుడు షాక్ అయ్యాయని.. కానీ ఆయన చెప్పిన వివరాలు చూసిన తరవాత తమకు అసలు విషయం అర్థమైందన్నారు పాల్. ఇదంతా చంద్రబాబే చేయించాడంటున్న కే ఏపా పాల్ ఎన్నికలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. 

తాము ఈసీని కలిసి పరిస్థితి వివరించినా ఈసీ పెద్దగా పట్టించుకోవడం లేదని పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. 11 చోట్ల వైసీపీ కూడా తమ పార్టీ బీ పామ్స్‌తో నామినేషన్లు వేయించిందని పాల్ అన్నారు. అంతేకాకుండా అసలైన తమ పార్టీ అభ్యర్థులను చాలా చోట్ల నామినేషన్లు తిరస్కరించారని పాల్ అంటున్నారు. 

జగన్ ను ఓడించేందుకు చంద్రబాబు తమ పార్టీ బీ ఫామ్స్ వాడుకుంటున్నాడని.. ప్రపంచంలో ఇంకెక్కడా ఇలా జరగలేదని పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చంద్రబాబు ఏజెంట్ అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని.. చంద్రబాబు అవినీతిపరుడు, మోసగాడు అంటూ ఆరోపించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: