పవన్ కల్యాణ్ ఎందుకు ఇటీవల టీడీపీ సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నాడు.. ఆయన ఒక ప్రతిపక్ష పార్టీ అయి ఉండి మరో ప్రతిపక్షం వైసీపీనే ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు.. అధికారపక్షంతో పవన్ కల్యాణ్ కుమ్మక్కయ్యారా.. ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు బాగా వినిపిస్తున్నాయి.


అయితే ఈ విమర్శలకు పవన్ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. 2018  తర్వాత రాష్ట్రంలో టీడీపీయే లేదట.. వైసీపీయే తమ ప్రధాన ప్రత్యర్థి అట.. అందుకే తాను వైసీపీని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారట.. ఇవన్నీ ఎవరి డైలాగులో అంటారా.. జనసేన అధిపతి పవన్ కల్యాణ్ తాజా అస్త్రాలు.. 

2018 తర్వాత రాష్ట్రంలో టీడీపీయే లేదట.. ఆ పార్టీ సైకిల్ చైనును కేసీఆర్ లాగేసిన తర్వాత ఇక ఆ పార్టీ ఎక్కడుందని ప్రశ్నిస్తున్నారు పవన్ కల్యాణ్.. అయినా ఆ పార్టీని తిట్టాల్సినవన్నీ ఇప్పటికే తిట్టేశారట.. ఇక లేని పార్టీ గురించి మాట్లాడటమెందుకని విమర్శలు తగ్గించేశారట. 

ఇప్పుడు ఈ పవన్ కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. మరి చంద్రబాబు పరువు తీసేందుకు ఇలా మాట్లాడారా.. లేక టీడీపీతో దోస్తీని ఇలా తప్పుదోవపట్టిస్తున్నారో తెలియదు కానీ ఏకంగా టీడీపీ రాష్ట్రంలో లేదు అని కామెంట్ చేయడం మాత్రం సంచలనమే. 



మరింత సమాచారం తెలుసుకోండి: