ఎన్నికల ప్రచారం, ప్రకటనలు, వాగ్దానాలతో దేశం ఆసేతు శీతాచలం వాతావరం వేడెక్కింది. పోలింగ్ రోజు ముంచుకొస్తోంది. ఓటర్‌ ను ఆకర్షించేందుకు ఎన్నిరకాల ప్రలోభాలు వారిని కలిసేందుకు ఎన్ని దారులు ఉన్నాయో... అన్నింటినీ వినియోగించుకునేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు రాజకీయ నాయకులు. ఓటరైన మీకు ఉన్నట్టుండి ఏదో తెలియని నెంబర్ నుంచి కాల్ రావడం‘ ఫలానా పార్టీ నుంచి ఫలానా అభ్యర్థికే ఓటేసి గెలిపించండి..’ అంటూ నాయకులు, వారి అనుచరులు చెప్పడం తో ఆశ్చర్యపోవటం మీ వంతవుతుంది.

election campaigns vs data theft కోసం చిత్ర ఫలితం

“తమకే ఓటేయండని కాల్ వచ్చిందా? మీ ఫోన్ నెంబర్ వాళ్ల దగ్గరికి ఎలా వెళ్తుందో తెలుసా? ఫలనా పార్టీ అభ్యర్థికే ఓటు వేయండి...” అంటూ కాల్స్ - తమ నెంబర్ వారి దగ్గరికి ఎలా వెళ్లిందో తెలియక తికమక పడుతున్న జనాలు, మాకు తెలియకుండా మా పేరు ఫోన్ నెంబర్ వాళ్లకెలా తెలిసింది...’ అనేది ప్రస్తుతం అందరి లోనూ కలుగు తున్న అతిపెద్ద సందేహం. పెద్దగా పట్టించుకోకపోయినా దీని వెనక పెద్ద నెట్‌వర్క్ ఉంది.

 election campaigns vs data theft కోసం చిత్ర ఫలితం

మొన్నటికి మొన్న ఏపి ప్రభుత్వం నుండి అశోక్ అనే ప్రభుత్వాధినేతల అతి దగ్గర వ్యక్తి  "డేటా గ్రిడ్" పేరుతో సమాచారం అందిపుచ్చుకొని సమాచార చోరీ చేసింది మనకు తెలిసిన విషయమే. విశాల్ హీరోగా వచ్చిన ‘అభిమన్యుడు’ సినిమాలో లాగే ఇక్కడా జరుగుతున్నది  ‘డేటాచోరీ’ యే! తమ నియోజికవర్గంలో ఉన్న ఓటర్ల నెంబర్లు, పేరు చిరునామాతో సహా వారి సమాచారం సేకరించేందుకు ప్రైవేటు ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారు నాయకులు. ఈ ఏజెంట్లు ప్రజల దగ్గరి నుంచి అతి తేలికగా సమాచారం సేకరించే పద్ధతులను ఎన్నుకుంటున్నారు.


వివిధ ప్రాంతాల్లో సమాచారం ఎవ్వరి దగ్గర ఉంటుందనే విషయం పక్కా ప్రణాళికతో పసిగడు తున్నారు. కేబుల్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా పేరు, మొబైల్ నెంబర్, అడ్రెస్ వంటి వివరాలు ఇచ్చి తీరుతారు. ఈ సమాచారాన్ని కేబుల్ ఆపరేటర్ల దగ్గర్నుంచి సేకరిస్తున్న ఏజెంట్లు, మరింత సమాచారం కోసం గ్యాస్ ఏజెన్సీ, మీ-సేవా కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగులను ఆశ్రయిస్తున్నాయి.

personal data theft from cable mobile operators కోసం చిత్ర ఫలితం

ఇంకొందరు మరికాస్త ముందుకెళ్లి మొబైల్ ఆపరేటర్ల నుంచే సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఎయిర్ టెల్, జియో, వోడాఫోన్, ఐడియా సిమ్ తీసుకునేటప్పుడు వ్యక్తిగత సమాచారం, ఫోన్ నెంబర్ వివరాలు ఇస్తాం. ఒక్కసారి సిమ్ యాక్టివేట్ అయిన తర్వాత ఆ డాక్యుమెంట్స్ అన్నీ గోడౌన్లోకి చేరుతాయి. కాని వాటిని అతి భద్రంగా దాచి పెట్టి, ఆ డేటాను ఏజెన్సీలకు అమ్ముకుంటున్నాయి కొన్ని సంస్థలు. ఇది చాలా పెద్ద నేరం. కానీ గుట్టుగా జరుగుతున్న అతిపెద్ద సమాచార దోపిడీ వ్యాపారం.

personal data theft from cable mobile operators కోసం చిత్ర ఫలితం

ఇవీ కాకుండా సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కూడా సమాచారాన్ని సేకరించి, కాచి వడబోస్తున్నాయి కొన్ని ఏజెన్సీలు. ఇంకా అత్యంత ఖచ్చి తమైన సమాచారం నెలవారీ చెల్లించే నీటి బిల్లులు మొదలైన సమాచారం కాలనీల్లో రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ల నుండి కూడా సేకరిస్తుంటారు.



చివరగా మన ప్రభుత్వాలే ప్రజలకు చెందిన "డేటా గ్రిడ్" అశోక్ లాంటి వారికి వ్యక్తుల సమాచారం రాజకీయ పార్టీల స్వార్ధం కోసం అందించటం చూస్తూనే ఉన్నాం! కాబట్టి ఎపిలో ప్రజలకు ప్రైవసీ అనేదే లేకుండా పోయింది. అనేక బ్రతుకులలోని సున్నితమైన విషయాలు డేటా సేకరణ పేరుతో రోడ్లపైన అమ్మకానికి దొరకటం దిక్కు మాలిన తనం కాక మరేమౌతుంది.    

మరింత సమాచారం తెలుసుకోండి: