శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ స్థానాలన్నింటిలోనూ కేకే టీమ్ గ్రౌండ్ లెవల్లో సర్వే చేసింది. ప్రతి గ్రామాన్ని సందర్శించి సర్వే చేశామని కేకే టీమ్ చెబుతోంది. ఎన్నికల దగ్గరపడిన నేపథ్యంలో ఇక ఫైనల్ రిపోర్ట్ ప్రకటించారు. 


కేకే సర్వే అంచనా ప్రకారం మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో.. వైసీపీ ఆధిక్యంలో ఉంది. టీడీపీ- వర్సెస్ వైసీపీ పోటా పోటీగా 2 స్థానాల్లో తలపడుతున్నాయి. ఈ రెండింటిలో ఎవరు గెలుస్తారో చెప్పడం చాలా కష్టం అంటున్నారు కేకే. 

ఇక మరో స్థానంలో టీడీపీ-వైసీపీ-జనసేన కూడా హోరాహోరీ తలపడుతున్నాయట. ఇక్కడ కూడా గెలుపెవరిదో చెప్పడం కష్టం అంటున్నారు. ఇక మిగిలిన ఏడు నియోజకవర్గాల్లోనూ వైసీపీ ఆధిక్యం కనపరుస్తోందట. ఈ ఏడింటిలో వైసీపీ గెలుస్తుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదంటున్నారు కేకే. 

సో.. పైనల్‌గా శ్రీకాకుళం జిల్లాలో ఏడు స్తానాలు వైసీపీ పరం కాబోతున్నాయి. మరో రెండు స్థానాల్లో టీడీపీ- వైసీపీ హోరాహోరీ నడుస్తోంది. అంటే టీడీపీ గరిష్టంగా 2 స్థానాలు గెలుచుకునే ఛాన్స్ ఉంది. జనసేన ఒక్క స్థానంలో గెలిచే ఛాన్సుంది. ఇదీ శ్రీకాకుళం జిల్లా ఫైనల్ సర్వే రిపోర్ట్.



మరింత సమాచారం తెలుసుకోండి: